రివేంజ్ పోర్న్... ప్రస్తుతం ఈ నయా దందా ప్రపంచంలో చాలా ఎక్కువైంది. ఎదుటి వారికి తెలియకుండా వారి అంగీకారం లేకుండా వారితో కలిసి దిగిన వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టి బెదిరించడమే రివేంజ్ పోర్న్. ప్రస్తుతం ఒకవైపు కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను కలవర పెడుతుంటే మరోవైపు రివేంజ్ పోర్న్ పై దృష్టి పెట్టి అవతలి వారిని బెదిరించడం ఎక్కువ అయిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇలాంటి ఇ పనులు ఇళ్లలో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువగా చేస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది. అయితే అమెరికా లాంటి కొన్ని దేశాలలో ఈ రివేంజ్ ఒక ట్రెండ్ గా మారిందట. అసలు ఈ రివెంజ్ ఫోన్లో ఒక జరిగిన సంఘటన ఏమిటంటే... ఒక వ్యక్తి ఈ రివేంజ్ పోర్న్ తన మాజీ భార్య పై చేయడం మొదలుపెట్టాడు. దీనితో ఆమెకు అతను భారీ మూల్యం చెల్లించాల్సి అవసరం వచ్చింది.


అమెరికాలోని నార్త్ కోరిలేనా నాకు చెందిన ఎలిజబెత్ తన మాజీ భర్త ఆడం క్లార్క్ పై రివేంజ్ పోర్న్ లాస్ దాఖలు చేసింది. అమెరికా దేశ ఆర్మీ లో పనిచేస్తున్న ఆడం క్లర్క్ తన గర్ల్ ఫ్రెండ్ బరేట్ తో కలిసి ఉంటున్నాడు.ఆమె కూడా అమెరికా దేశపు ఆర్మీ లో నే పని చేస్తోంది. ఇకపోతే ఆమె వల్లే తమ వైవాహిక జీవితం ముక్కలైందని ఎలిజిబెత్ అందులో ఆరోపణ చేసింది. అంతేకాకుండా తనకు అతిగా తినే వ్యాధి ఉందని ఆడం తప్పుడు ప్రచారం చేశాడని ఆన్లైన్లో తన నగ్న చిత్రాలు పెట్టి పరువు తీశాడు అని కోర్టులో వాపోయింది ఎలిజబెత్. అంతేకాకుండా ఆడం గర్ల్ ఫ్రెండ్ అక్రమంగా తన మెడికల్ రికార్డులను సంపాదించిందని కోర్టుకు తెలియజేసింది. ఈ కేసును విచారించిన కోర్టు ఎలిజబెత్ తరుపున ఏకంగా 3.2 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనితో అతను రివేంజ్ పేరిట అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాం అని బాధ పడాల్సి వచ్చింది.


ఇకపోతే మన దగ్గర కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఇప్పటికిప్పుడు చోటుచేసుకుంటున్నాయి. చాలామంది ప్రేమిస్తున్నానని అమ్మాయిలకు దగ్గరై ఆ తర్వాత వారి వీడియోలు, ఫోటోలు తీసి వాటిని నెట్టింట పెడుతూ వారిని బెదిరిస్తూ వారి కామ వాంఛలను తీర్చుకుంటున్న సంగతి రోజుకొక చోట చూస్తూనే ఉన్నాం. అయితే ఈమధ్య కాలంలో ఈ రివెంజ్ పోర్న్ పై విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు కొన్ని దేశాలలో. ఇటీవల CBSE విద్యార్థులకు దీనిపై అసైన్మెంట్ కూడా ఇచ్చారంటే ఆలోచించండి. ఎవరైనా తోటి విద్యార్థుల అభ్యంతర ఫోటోలు, వీడియోలు షేర్ చేసే కొందరు విద్యార్థులు ఉండడంవల్ల దీంతో CBSE ఈ చర్యకు పాల్పడింది. అయితే ఇందులో విద్యార్థులను హెచ్చరిస్తూ సైబర్ సేఫ్టీ హ్యాండ్ బుక్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: