ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. మ‌రియు ఎంద‌రినో హాస్ప‌ట‌ల్ పాల‌య్యేలా చేసింది. దీంతో క‌రోనా పేరు వింటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనా కంటికి క‌నిపించ‌క‌పోయినా.. ప్ర‌పంచ‌దేశాలు ఈ మ‌హ‌మ్మారితో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా దూకుడు త‌గ్గించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు ఎటు నుంచి వ‌చ్చి క‌రోనా కాటేస్తుందో తెలియ‌క భ‌యంభ‌యంగా ఉంటున్నారు. 

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మయంలో చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని గుర్తించడానికి ఆస్పత్రికే వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని మెడికల్ గ్యాడ్జెట్స్‌ని ఇంట్లో ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యల్ని తెలుసుకోవచ్చు. అందులో ముందుగా..  థర్మామీటర్. అసలే ఇప్పుడు కరోనా వైరస్ కాలం. అందుకే శరీరం కాస్త వేడిగా అనిపిస్తే థర్మామీటర్‌తో టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మ‌న‌కు జ్వ‌రం ఉందో లేదో తెలుస్తుంది. అలాగే ఇంట్లో ఉండాల్సిన మ‌రో మెడికల్ గ్యాడ్జెట్‌ గ్లూకోమీటర్. నేటి కాలంలో డయాబెటిస్ కామ‌న్ అయిపోయింది. అందుకే బ్లడ్ షుగర్ చెక్ చేయడానికి గ్లూకోమీటర్ ఉండటం మంచిది.

 

తినడానికి ముందు తిన్న తర్వాత బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నా, ఆస్తమా పేషెంట్లు ఉన్నా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నా నెబ్యులైజర్ ఉండటం మంచిది. దీని వ‌ల్ల ప్రతీసారి క్లినిక్‌కు వెళ్లాల్సిన అసరం ఉండ‌దు. అలాగే మీరు ఒక్కసారిగా బరువు తగ్గడం, పెరిగినట్టు మీకు అనిపించిందా? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇలా జరగొచ్చు. అందుకే తరచూ బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకే వెయింగ్ మెషీన్ ఖ‌చ్చితంగా ఇంట్లో ఉండాలి. కాగా, వీటిని  ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: