నోరు అదుపులో ఉంటే మన భవిష్యత్ బావుంటుంది. నోరు అదుపు తప్పితే అది అగమ్యగోచరం అవుతుంది. మనకు సంబంధించిన విషయాలు అన్నీ అందరితో పంచుకుంటే నలుగురిలో మనమే పలుచని అవుతాము. ఏ విషయం చెప్పాలి.. ఏది చెప్పకూడదు అన్న విచక్షణ మనిషికి చాలా అవసరం.

 

 

మనం మన వయస్సు గురించి గానీ, ధనం గురించి గానీ, ఆయుస్సు గురించి గానీ ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు. ఆయువు,అంటే వయస్సు చెప్పకూడదు అని ఒక అర్థం. అలాగే.. ఇద్దరు కలిసి ఇష్టపడి పంచుకున్న ప్రేమను మరియు యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు.

 

 

మరికొందరు తాము చేసిన దానాల గురించి డప్పు కొట్టుకుంటారు. మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదట. అలాగే మనకు జరిగిన అవమానమును కూడా ఎవరికీ చెప్పకూడదట. ఇద్దరు ఎంతో మంచి హృదయంతో కలిసిన సంగమము గురించి కూడా చెప్పకూడదట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: