తాజాగా తేలిన పరిశోధనలలో ఎక్కువగా ఉప్పు కలిగిన ఆహారం తరచుగా స్వీకరించడం వలన రోగనిరోధక శక్తి క్షీణిస్తుందని... ఫలితంగా అనేకమైన ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి సోకుతాయని తేలింది. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్ లో ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు ప్రచురించబడ్డాయి. పరిశోధనలో పాల్గొన్న ఒక బృందం ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎలుకలకు మూడు వారాల పాటు పెట్టారు. అయితే ఈ ఎలుకలలో కొద్ది రోజుల్లోనే చాలా బ్యాక్టీరియా ఆధారిత వ్యాధులు తలెత్తాయి.

 


ఇంకొక పరిశోధన లో కొంతమంది వ్యక్తులు సాధారణ స్థాయి కంటే ఆరు గ్రాముల ఎక్కువగా ఉప్పుని తాము తినే ఆహారంలో కలుపుకొని స్వీకరించారు. అయితే వారందరి రక్తంలోని గ్రానులో సైట్స్ పరీక్షించగా... వారి రోగ నిరోధక శక్తి తీవ్ర స్థాయిలో తగ్గిపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వయసు వచ్చిన ప్రతి ఒక్కరూ ఐదు గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తినకూడదు. 5 గ్రాములు అనగా టేబుల్ స్పూన్ లో సగం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. 

 


జర్మనీకి చెందిన ప్రముఖ డాక్టర్ క్రిస్టయిన్ కర్ట్స్ మాట్లాడుతూ... ఉప్పు ఎక్కువగా స్వీకరించడం వలన ఇమ్యూన్ సిస్టం డ్యామేజ్ అవుతుందని తొలిసారిగా మేము రుజువు చేసాము అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మనం రోజు తీసుకునే ఆహారంలో ఉప్పు స్థాయి మనకి సరిపడినంత ఉంటుంది. కానీ మనం ఆహారంలో సాల్టు వేస్తూనే ఉంటాం. మరీ ఎక్కువగా సాల్ట్ వేయడం వలన మన శరీరంలోని మంచి బాక్టీరియా చనిపోతుంది. ఫలితంగా చెడు బ్యాక్టీరియాలను, వైరస్లను చంపే శక్తిని మన శరీరం కోల్పోతుంది. 

 


అందుకే పండితులు చప్పగా ఉన్న ఆహారం మాత్రమే ఎక్కువగా స్వీకరిస్తారు. ఫలితంగా వారికి ఎలాంటి రోగాలు రాకుండా నిండు నూరేళ్ళు జీవిస్తారు. ఇప్పటికైనా... ఎక్కువగా ఉప్పు కలిగిన ఆహారంగా స్వీకరించడం ఎంతైనా హానికరమని మీరు గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: