మనం మనుషులం.. ఎంతగా సమాజం కమర్షియల్ అవుతున్నా.. మనుషుల్లో మానవత్వం ఇంకిపోదు.. ఎంతటి రాతిగుండె అయినా ఏదో ఒక సమయంలో తడిబారుతుంది. ఏ హృదయ విదారక దృశ్యమో కనిపిస్తే అయ్యో పాపం.. అనకుండా ఉండదు. ఆపదలో ఉన్నవారికి మన వంతు సాయం చేద్దాం అనిపించకమానదు.

 

 

తోటి మానవుడికి సాయపడటం కంటే భాగ్యం ఏముంటుంది. కానీ చాలా మంది దానాలు చేయరు. కొందరు పావలా దానం చేసి పది రూపాయల పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ప్రకృతి ప్రమాదాల సమయంలోనూ.. కరువు కాటకాల సమయంలోనూ దానాలు చేసే చాలా మంది వాటిని తమ వంతుగా ప్రచారమూ చేసుకుంటుంటారు.

 

 

కానీ.. మనం చేసే దానం గురించి ఎవరికీ చెప్పకూడదట. దానం అన్నింటిలో చాలా గొప్పది. అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదట. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుందంటారు పెద్దలు. దానినే గుప్త దానం అంటారు. గొప్పలు చెప్పుకుంటున్న భగవంతుని ఆగ్రహం తప్పదట.

 

 

ఏదైనా మనది కాదు అని తెలిసిన మరుక్షణం అది మన వద్ద ఉంచుకోకూడదట. దాని వల్ల మన వద్ద ఉన్న మన స్వంత సంపదను దేవుడు మరింత తీసివేస్తాడట. అందుకే దానాలు చేసినా వాటి గురించి ప్రచారం చేసుకోకండి. మనం చేసిన దానం ఊరికే పోదు. కష్టకాలంలో మనకూ ఇంకొకరు సాయం చేస్తారు. చేయందిస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: