సాధార‌ణంగా పెళ్లి తర్వాత చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నపళంగా బరువు పెరుగుతూ ఉంటారు. అలా ఉన్నపళంగా బరువు పెరుగుతూ పోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి. కానీ, ఇది స‌హ‌జ‌మే అయినా.. దానికి గ‌ల కార‌ణాల‌ను ఏవేవో అనుకుని భ్ర‌మ ప‌డుతూ ఉంటారు. అయితే మ‌రి పెళ్లి తర్వాత బ‌రువు పెర‌గ‌డానికి కారణం ఏంటనేది? ఇప్పటికీ చాలామందిలో ప్రశ్నగానే  మిగిలి ఉంది. వాస్త‌వానికి పెళ్ళైన కొత్తలో లైఫ్ చాలా బావుంటుంది. జీవితంలో మార్పు వస్తుంది. అంతా కొత్తగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే  ప్రతి జంట ఒకరికొకరు తమ వంట నైపుణ్యాలను ప్రదదర్శిస్తూ ఉంటారు. 

 

ఇది బరువు పెరగటానికి మరో ముఖ్య కారణం. భార్య లేదా భ‌ర్త‌ రుచికరమైన వంటలు వండుతారు. అవి ఇద్దరూ తింటారు. ఇది శరీరంలోని అన్ని ప్రదేశాలలో అనవసరమైన ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణం అవుతుంది. దీని వల్ల త్వరగా బరువు పెరుగుతారు. ఇక పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మహిళల ఆలోచనలలో చాలా తేడా వస్తుంది. కుటుంబం మొత్తం గురించి ఆలోచించాలి, ఆఫీస్, పని ఒత్తిడి కారణంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, బయట ఫుడ్స్ తిన‌డం ఇలాంటి వాటి వ‌ల్ల కూడా బ‌రువు పెరిగే ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నాయి.

 

అదేవిధంగా, చాలా మంది పెళ్ళైన తరువాత ఫిట్ గా ఉండటానికి చేసే కసరత్తులు ఆపేస్తారు. వివాహం చేసుకున్న జంటలతో పోల్చితే అవివాహితులు తమ ఫిట్ ‌నెస్ సమస్యలను మరింత తీవ్రంగా తీసుకుంటారు. కానీ, పెళ్లి అయిన తర్వాత ఫిట్ గా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపరు. దీని వ‌ల్ల కూడా బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. అలాగే వివాహం తర్వాత మహిళలు బరువు పెరగడానికి మరో కారణం గర్భధారణ. కడుపులో బిడ్డ పెరుగుతూ ఉండటం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇక  పెళ్లి అయిన తర్వాత చాలా మంది రెస్ట్ తీసుకునేందుకు ఇష్టపడతారు. ఇది బాడీలో ఆక్సిటోసిన్ ను విడుదల చేస్తుంది, ఈ బరువు పెరగడానికి కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: