కొంత మంది స్నేహితులు ఉంటారు.. ఏ విషయం అయినా షేర్ చేసుకుంటారు. ఆఫీసు విషయాల నుంచి కుటుంబ విషయాల వరకూ అన్నీ పంచుకుంటారు. మంచిదే ఇలాంటి ప్రాణ స్నేహితులు ఉండటం మంచిదే. అలాంటి వారి వల్ల మన మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి.

 

 

ఎంత ప్రాణ స్నేహితులైనా దానికీ ఓ సరిహద్దు అంటూ ఉంటుంది. కొన్ని విషయాలు ప్రాణ స్నేహితులైనా సరే పంచుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. అందులోనూ ఈ రోజుల్లో ప్రాణ స్నేహం అంటూ ఉండే అవకాశాలు తక్కువ. ఉన్నా సరే కొన్ని విషయాలు మాత్రం వారితో పంచుకోకూడదు.

 

 

అవేమిటంటే.. పడక గది విషయాలు.. స్త్రీలైనా, పురుషులైనా సరే.. ఇలాంటి పడకగది విషయాలు ప్రాణ మిత్రులతోనైనా సరే చర్చించకూడదని చెబుతారు. అంతగా పడకగది సమస్యలు ఉంటే సంబంధింత వైద్యుడి దగ్గరకు వెళ్లడమో, కౌన్సెలింగ్ తీసుకోవడమో చేయాలి కానీ.. మిత్రులే కదా అని ఇంటి గుట్టు బయటపెట్టుకోకూడదు.

 

 

ఎందుకంటే.. శృంగారం, సంగమం అంటే కలయిక.. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం రహస్యంగా ఉంచడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను ఎంత స్నేహితులైనా సరే చెప్పుకోకూడదు. అంతగా బాధపడుతుంటే మానసిక నిపుణుల వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవాలి. స్నేహితులే కదా అని ఈ విషయాలు చెప్పుకుంటే.. మరో రోజు అవి మనకే ఇబ్బందులుగా మారతాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: