ప్రస్తుతం ప్రపంచంలో ప్రయాణాలు అత్యంత సులువైన మార్గాలుగా ఏర్పడ్డాయి.  ఒకప్పుడు సైకిల్ పై ప్రయాణం చేసేవారు.. ఆ తర్వాత మోటర్ వాహనాలు, కార్లు ఎక్కువ వాడటం మొదలు పెట్టారు. దాంతో సైకిల్ వినయోగాలు చాలా వరకు తగ్గాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సైకిలింగ్ చేసేవారు ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇలీవల జ్యోతి అనే అమ్మాకి ఢిల్లీ నుంచి తన గ్రామానికి పన్నెండు వందల కిలీమీటర్లు సైకిల్ పై తన తండ్రిని తీసుకు వచ్చింది. నేడు  వరల్డ్ బైస్కిల్ డే... ఈ ఒక్కరోజును బైస్కిల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం కాదు... వారానికి ఒక్కరోజైనా సైకిల్ తొక్కితే అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

IHG

అందుకే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా బైస్కిల్ ప్రాముఖ్యతను గుర్తించడం విశేషం. మరి సైకిల్ తొక్కితే వచ్చే లాభాలేంటో తెలుసుకోండి.  ఇది కొన్ని సినిమాల ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ సైక్లింగ్ అనేది కేవలం ఓ చోటు నుంచి మరో చోటుకి వెళ్లడమే కాదు.. దీని వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. సైకిల్ కీ మనసుకీ ఏం సంబంధం అనుకుంటున్నారా? సైకిల్ ఎక్కి అలా చల్ల గాలి లో ఒక రౌండ్ కొట్టి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. మీ వర్రీస్ నీ ప్రాబ్లంస్ నీ ప్రాసెస్ చేసుకోడానికి సైక్లింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. మరీ ముఖ్యం గా డిప్రెషన్ తో బాధ పడుతున్నవారికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

IHG

బరువు తగ్గడంతో పాటు కండరాలు పటిష్టమౌతాయిశృంగార జీవితంలో సమస్యలా? సైక్లింగ్‌కు మించిన మెడిసిన్ లేదంటారు వైద్య నిపుణులు. సైక్లింగ్ ఉదరం కిందిభాగంలో కండరాలకు మేలుచేస్తుంది. శృంగార సమస్యల్ని తీర్చుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? దీనికీ సైకిల్ తొక్కడమే మంచి మెడిసిన్. నిద్రపోయే ముందు సైకిల్ తొక్కి అలసిపోతే హాయిగా నిద్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: