జీవితంలో విజయం సాధించాలని కోరుకోనిదెవరు.. కానీ ఆ విజయానికి అవసరమైన సన్నద్ధత మాత్రం చాలా మందికి ఉండదు. గెలుపు కోరుకోవడం అత్యాశ కాదు.. కానీ కష్ట పడకుండా గెలవాలనుకోవడం మాత్రం కచ్చితంగా అత్యాశే. అందుకే.. గెలుపు కోరుకుంటే.. నీ దారి నీవే వెతుక్కో, నీ గమ్యం నీవే నిర్దేశించుకో. అంతే..

 

 

నీ లక్ష్యం చేరడానికి అసలు సిసలైన ఆయుధాలు ఉన్నాయి. అవే.. నిజాయితీ, నీతి, ఓర్పు, సహనం. ఈ ఆయుధాలు నువ్వు నీ వ్యక్తిత్వంలోకి తీసుకోవాలి. అందరితో జ్ఞానాన్ని పంచుకోవాలి. ఇవన్నీ చేయటానికి సమయపాలన, నిబద్ధత, నిరంతర అభ్యాసన కావాలి. ఈ అందమైన జీవితం అద్భుతమైన, ఆదర్శవంతమైన ఒక వంతెనగా నిలవాలి.

 

 

ఎందుకంటే.. నువ్వు మహర్షిగా మారకపోయినా ఫర్వాలేదు. మహనీయునిగా అందరిచేత కీర్తింప బడకపోయినా ఫర్వాలేదు. ఈ లోకానికి మహారాజువి కాకపోయినా ఫర్వాలేదు. కానీ నీ మనఃసాక్షికి మాత్రం నువ్వు ఎప్పుడూ జవాబుదారిగా వుండు, నీ ప్రతి పనినీ చర్యను, చర్చను, నీ మనస్సుతో పంచుకో, తప్పొప్పులు నీవే నిర్దేశించుకో.. అప్పుడు విజయం సంగతేమో కానీ విజయం కోసం నువ్వు చేసే పోరాట గమ్యం గురి తప్పదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: