నిజానికి అనేక సినిమాలలో ప్రేమ గురించి ఎన్నో పాటలు, డైలాగులు మనం చూస్తుంటాం... వింటుంటాం... ఇకపోతే ఆమెను చూసి ఒక్కోసారి ఇవి సిల్లీగా అనిపించినా నిజానికి కొంతమందికి చాలా వరకు సినిమాల్లో జరిగినట్టే జరుగుతాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. కొత్తగా ప్రేమలో పడిన వారికి తాము ప్రేమించే మనిషిని కాస్త దగ్గరగా ఉన్నా సరే గుండె మీకు తెలియకుండానే చాలా వేగంగా కొట్టుకుంటుంది అని వారు తెలియజేస్తున్నారు. అలాంటివారు ఎప్పుడైనా మనల్ని ముట్టుకున్న, తగిలిన గుండె మరింతగా వేగంగా కొట్టుకుంటుంది.నిజానికి అబ్బాయిలు వారికి నచ్చిన అమ్మాయి లేదా ఎవరైనా అమ్మాయి అందంగా కనిపించినా దగ్గరికి వస్తే నిటారుగా నిలబడుతారట. అంతేకాదు వారి ముందు ఫిట్ గా కనిపించాలని ఆపసోపాలు పడతాడు కూడా. ఒక మనిషికి అవతలివారు నచ్చిన విషయం మెదడు కేవలం నాలుగు నిమిషాల్లోనే తెలుస్తుందట. మన మనసుకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కానీ మెదడు మాత్రం కేవలం నాలుగు నిమిషాలు అంటే నాలుగు నిమిషాలు చాలట.

 

ఇక కొందరైతే కొత్తగా ఎవరైనా అమ్మాయి కానీ... అబ్బాయి కానీ... పరిచయం చేసుకునేటప్పుడు కాస్త హైరానా పడిపోతుంటారు. దీనికి కారణం శరీరంలోని కార్టిసాల్ అని ఒక రసాయనం. కొంతమంది ప్రేమ పేరు ఎత్తితే నిజంగా హడలెత్తి పోతారు. అలాంటి పక్రియను ఫైఫోబియా అని పిలుస్తారు. ఇక అలాగే కొందరికైతే అసలు ప్రేమ ఫీలింగే ఉండదట... వారిని హైపోపిక్యూట్ అంటారట. నిజానికి కొంత మంది అబ్బాయిలు.. అమ్మాయిలు ఎవరైనా ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నప్పుడు చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారట. అంతేకాదు వార్త ఎక్కువసేపు గడపాలి అని కూడా భావిస్తారట. ఒక కొందరికి డ్రగ్స్ వాడితే మెదడు ఎలా పని చేస్తుందో అలాగే ప్రేమలో ఉన్నప్పుడు కూడా వారు అలా ఫీల్ అవుతారట. అంతేకాదు కొంతమందికి మనసుకు నచ్చిన వారిని ఘనంగా హత్తుకుంటే ఒంటి నొప్పులు ఇట్టే పోతాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: