ఇటీవ‌ల కాలంలో అందరూ ఫిట్‌నెస్‌పై మక్కువ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాడీని హెల్తీగా, ఫిట్‌గా ఉంచుకునేందుకు చెమటలు పట్టేలా వర్కవుట్లు చేస్తుంటారు. అలా చేయ‌డం మంచిదే కూడా. రెగ్యులర్ వ‌ర్క్‌వుట్స్ చేయ‌డం వ‌ల్ల చాలా ఆరోగ్యకరం. అయితే సరైన రిజల్ట్స్ రావాలంటే వ్యాయామం గంటల తరబడి చేస్తేనో, కొత్త కొత్త వర్కవుట్స్ చేస్తేనో సరిపోదు. చేసేది చిన్న వ్యాయామమైనా సరైన పద్ధతిలో చేయాలి. స‌రైన జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి. ముఖ్యంగా వ‌ర్క్‌వుట్‌కు ముందు కొన్ని ఆహార ప‌దార్థాలు మాత్రం అస్స‌లు తీసుకోకూడ‌దు.

 

అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా చాలా మంది ఉదయాన్నే ఓ గ్లాస్ పాలు తాగేసి వర్కవుట్ చేస్తుంటారు. కానీ, ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలు తాగి వర్కవుట్ చేస్తే... అవి వెంటనే జీర్ణం కాక‌పోవ‌డంతో పాటు పొట్టలోనే ఉండి వికారం తెప్పిస్తాయి. వాటి నుంచీ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీంతో వర్కవుట్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబ‌ట్టి, దీని జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌. అలాగే వర్కవుట్‌కి ముందు చిల్లీ నూడుల్స్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడ‌దు.

 

ఎందుకంటే.. స్పైసీ ఐటెమ్స్ గుండెకు చేటు చేస్తాయి. అదే స‌మ‌యంలో వర్కవుట్స్‌లో అసౌకర్యం కలిగిస్తాయి. ఇక వ‌ర్క‌వుట్ చేసేట‌ప్పుడు పొట్టలో తేడాగా అనిపిస్తుంది కూడా. అందుకే వ‌ర్క‌వుట్ చేసేముందు వీటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా.. గింజలు, తృణధాన్యాలు కూడా వ‌ర్క‌వుట్ చేసే ముందు తీసుకోకూడ‌దు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ. మ‌రియు ఫైబర్ కూడా ఎక్కువే. అవి జీర్ణం కావడానికి టైమ్ తీసుకుంటాయి. అంతేకాదు... పొట్టలో ఉబ్బినట్లుగా కూడా చేస్తాయి. ఇలాంటప్పుడు మీరు కావాల్సిన వర్కవుట్స్ చెయ్యలేరు. కొన్ని క‌ష్ట‌త‌ర‌మైన‌ వర్కవుట్స్ చెయ్యడం కూడా కష్టంగా మారుతుంది. సో.. ఈ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: