ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా ఎంతో మంది వైద్యులు పరిశోధకులు కొవిడ్-19 వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ ఏ దేశస్తులు తయారు చేయలేక పోయారు. మేము తయారు చేసాం అంటే మేము తయారు చేశామంటూ ప్రకటిస్తున్నారు తప్ప నిజంగా అవి ఒక covid 19 వ్యక్తిని సంపూర్ణంగా నయం చేయలేక పోతున్నాయి. కరోనా విరుగుడు వ్యాక్సిన్ కాని పట్టేసరికి అందుబాటులోకి వచ్చే సరికి చాలా నెలలు పడుతుందని తెలుస్తోంది. చికిత్స కంటే నివారణ నయం అన్నట్టు సకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్-19 వ్యాధి బారిన పడడం దాదాపు అసాధ్యం. 


ఈ పరిస్థితులలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారపదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం కాగా... ప్రత్యేకంగా విటమిన్ కె పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను ఆరగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తాజాగా చేసిన పరిశోధనలలో.... చనిపోయిన వేలమంది కొవిడ్-19 పీడితులలో విటమిన్ కె లోపం ఉందని తేలింది. అయితే విటమిన్ కె లో కొవిడ్-19 వ్యాధిని నిర్మూలించే లక్షణాలు ఉంటాయేమోనని వైద్యులు ఆశిస్తున్నారు. ఒక ప్రముఖ హాస్పటల్లో కొవిడ్-19 కారణంగా చనిపోయిన వ్యక్తులకు, సీరియస్ పరిస్థితుల్లో ఉన్న కరోనా పీడితులకు... విటమిన్ కె లోపానికి ఒక సంబంధం ఉందని తేలింది. 

 

కొవిడ్-19 వ్యాధి కారణంగా శరీరంలోని రక్తం గడ్డ కడుతుంది. అలాగే కొవిడ్-19 వ్యాధి ఊపిరితిత్తులలో సాగే ఫైబర్స్(
సాగి ముడుచుకొని లక్షణం గల కండర తంతువులు) ని నాశనం చేస్తుంది. అయితే విటమిన్ కె శరీరంలో ఎక్కువగా ఉంటే అది రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. అలాగే విటమిన్ కె ఊపిరితిత్తులను సమర్థవంతంగా సంరక్షిస్తుంది. డచ్ పరిశోధకలు విటమిన్ కె పై క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు డబ్బులను సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ డాక్టర్ రాబ్ జాన్స్సెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విటమిన్ కె పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తరచూ తినాలని సూచించారు. విటమిన్ కె ఊపిరితిత్తులకు, రక్తనాళాలకు, ఎముకలకు మంచి చేస్తుందని తాను చెప్పుకొచ్చాడు. 


విటమిన్ కె పాలకూర, గోంగూర, తోటకూర, బచ్చలి కూర, చేపలు, గుడ్లు, జున్ను వంటి పదార్థాలను పుష్కలంగా లభిస్తుంది. వీటిని మీరు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేటట్టు జాగ్రత్త పడితే నీకు విటమిన్-కె లోపం రాదు... ఫలితంగా మీకు కొవిడ్-19 ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: