శృంగారంలో తన పార్ట్నర్ తో రెచ్చిపోవాలని చాలామంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం చాలా మంది వయాగ్రా కూడా వాడుతుంటారు. దాన్ని వాడటం వల్ల అంగస్తంభన త్వరగా జరగకుండా ఉంటుందని కొందరు వాడుతుంటారు. అయితే వీటి వల్ల ఉపయోగాలు ఎన్నో అనారోగ్యం పాలు చేసేది కూడా అంతే శాతం ఉంది. ఇకపోతే చాలామంది తమ లైంగిక లోపం ఉంది అన్న అపోహతో వయాగ్రాని వాడుతుంటారు. అలా వాడుతున్న వారిలో 80 శాతం మందికి కేవలం మానసిక సంబంధించిన సమస్యలు తప్ప లైంగిక సమస్యలు ఉండవని తెలుపుతున్నారు నిపుణులు. నిజానికి వారి ఆలోచనలు వారి కొంప ముంచుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మానసిక సమస్యను వయాగ్రా ఏమాత్రం తగ్గించాలని తెలియజేస్తున్నారు. 

 


ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వారికి వైద్య చికిత్సలు అవసరమవుతాయి తప్ప వయాగ్రా కాదని తెలియజేస్తున్నారు. అనవసరంగా వయాగ్రా వాడటం వల్ల శృంగారంలో ఎక్కువ ఎంజాయ్ చేయడం ఏమో కానీ చాలా ప్రమాదాలకు గురవుతారు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి లోపం లేని కేవలం ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వారు మాత్రమే ఇలాంటి వయాగ్రాని వాడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుపుతున్నారు నిపుణులు. ఇది నిజానికి వారు అనుకున్నట్లుగా శృంగారం వాంఛను పెంచే ఉత్తరం కాకుండా అది పురుషాంగానికి రక్తసరఫరాను పెంచే మందు మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు. నిజానికి అంగస్తంభన లోపాలు లేని వారికి మరే ఇతర బాధలు లేని వారికి అసలు వయాగ్రా వాడటం అనవసరమని తెలుపుతున్నారు నిపుణులు. నిజానికి శృంగార సమయంలో పాజిటివ్ గా ఉండే మనసు మాత్రమే లైంగిక ఉత్ప్రేరకమని నిపుణులు తెలియజేస్తున్నారు. 

 


ఇక ఇవన్నీ పక్కన పెడితే వయాగ్రా వాడటం వల్ల కళ్ళకు తీవ్ర నష్టం కలుగుతుందని... వర్ణ దృష్టి ఎక్కువ ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో నిపుణులు తెలియజేశారు. అంతే కాకుండా వారు త్వరగా గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. వయాగ్రా వాడటం వల్ల పురుషాంగంలోని రక్తనాళాలు రిలాక్స్ చేయడం, రక్తాన్ని స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడితే నిజంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: