భారతదేశంలో లాక్ డౌన్ దెబ్బకి వలస కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో... సెక్స్ వర్కర్లు కూడా అంతే ఇబ్బందులు పడ్డారు. కరోణ వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాల అన్ని విలవిల్లాడుతుండగా అన్ని ప్రాంతాలలోనూ ఉన్న సెక్స్ వర్కర్లు దీనిని ఒకరకంగా నరకంగా అనుభవించారు. తమ శరీరాన్ని వ్యాపారం కింద మార్చి పొట్టకూటికోసం వాళ్లు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ పని మాత్రం సమాజంలో చాలా నీచంగా చూస్తారు వారిని. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా సెక్స్ వర్కర్లు కేవలం వాళ్ల బతుకు కోసమే ఈ జీవితం అన్నట్లుగా బతుకులు గడిపేస్తున్నారు.

 


నిజానికి కరోనా మహమ్మారి వాళ్ల జీవితాల్లో ఒక్కసారిగా కలవరం రేపింది. ఇంతకుముందు ఎయిడ్స్ ఏవిధంగా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిందో ఇప్పుడు కరోనా కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతుంది వారిని. నిజానికి వారు కూడా కరోనా మొదలైనప్పుడు కొద్ది వారాల వరకూ తమ వృత్తికి స్వస్తి పలికి ఖాళీగా ఉండి పోయారు. అంతేకాదు లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు కూడా ఈ పనికి దూరంగా ఉంటామని వారు చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ లాక్ డౌన్ ఇప్పటికే రెండు నుంచి మూడో నెల కూడా పూర్తి కాబోతుంది. కాబట్టి మరి వారి జీవితాలు గడవాలంటే కష్టమైపోయింది. కాబట్టి వారు ఈ కరోనా ను ఎదిరించి వారి దందా ను మొదలు పెట్టేశారు మళ్లీ. కాకపోతే వారి గడప తొక్కడానికి కస్టమర్లు కరువయ్యారు.. 

 


మామూలుగా ఎయిడ్స్ వ్యాధిని కండోమ్ తో నిరోధించవచ్చు. కానీ కరోనా వైరస్ మాత్రం వారికి మార్గం కనిపించట్లేదు. ఎందుకంటే వారిని ముట్టుకుంటే చాలు కరోనా వైరస్ సోకుతుంది కాబట్టి వారి ఆశ నిరాశే మిగులుతోంది. ఇక దీనితో వారు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు వాళ్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం వాళ్ళు డిజిటల్ టెక్నాలజీని బాగా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఎయిడ్స్ సోకకుండా కండోమ్ ఉంది కానీ ఇప్పుడు కరోనాకు రైన్ కోట్స్ ఉపయోగిస్తున్నట్లుగా ఓ సెక్స్ వర్కర్ తెలియచేసింది. అంతే కాదు చాలా మంది ఫోన్ రొమాన్స్ కూడా మొగ్గుచూపుతున్నారని వారు చెప్పడం నిజంగా విశేషం. ఫోన్ కాల్ లో వీడియో కాల్ చేసి వారిని తృప్తి పరుస్తున్నారట. కస్టమర్ల దగ్గర మాట్లాడుకున్న తరువాత నగదును కస్టమర్లు గూగుల్ పే ద్వారా వారికి చెల్లిస్తున్నారట. ఇప్పుడు వారు ఫోన్ కాల్ అయితే ఒక రేటు వీడియో కాల్ అయితే ఒక రేటు అన్నటుగా డబ్బులు సంపాదిస్తున్నారు. తన ముఖాన్ని ఎవరో రికార్డు చేయకుండా ఉండేందుకు దుపట్టాతో వారి ముఖాన్ని మూసుకొని ఈ పనులు చేస్తున్నారు. ఇక ఇందులో సాధారణ ఫోన్ కాల్ కు 300, వీడియో చాట్ కోసం ఏకంగా 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే అది కూడా కేవలం వారికి తెలిసిన కస్టమర్ల అయితేనే ఈ పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: