ప‌ట్టీలు.. ఆడ‌వారి అందాన్ని పెంచే ఆభ‌ర‌ణాల్లో ఇవి కూడా ఒక‌టి. వయసుతో ఎటువంటి సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్లందరూ ప‌ట్టీలు పెట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ఘల్లు ఘల్లు మంటూ ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంటే.. తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. లయబద్దంగా అవి చేసే శబ్ధం అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది.  పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కాని నేటి మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్‌మెటల్, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు, చివరకు ప్లాస్టిక్ గొట్టాలు, లెదర్‌తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయి.

 

అయితే ప‌ట్టీలు అమ్మాయిలకు అందాన్ని మాత్రమే కాదు.. అనేక ప్రయోజనాలు తీసుకొస్తాయి. పట్టీలు వేసుకోవడం వల్ల పాదాలకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండటానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే పట్టీల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఇక ముఖ్యంగా గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. అలా పెట్టుకోవ‌డం వ‌ల్ల  డెలివరీ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట.

 

అంతేకాదు, వెండి పట్టీలు రెగ్యులర్ గా పెట్టుకోవటం వల్ల స్త్రీలు సాధారణంగా ఫేస్ చేసే హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి రాకుండా ఉంటాయి. మ‌రియు సంతానంలో వచ్చే సమస్యల నుంచి, గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో పోరాడుతుంది. అలాగే వెండి ప‌ట్టీలు పెట్టుకోవ‌డం వ‌ల్ల వెండికి ఉండే యాంటి-బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇక మువ్వులను సాధారణంగా వెండివి లేదా బంగారానివి ధరిస్తారు. వెండి మువ్వలు ధరించడం వల్ల మహిళలు మరింత యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. మ‌రి ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న ప‌ట్టీలు రెగ్యుల‌ర్‌గా పెట్టుకోవ‌డం మీరూ అల‌వాటు చేసుకోండి.

  
 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: