సాధార‌ణంగా కాన్సర్ లాంటి వ్యాధులు వస్తే, వాటిని జయించడం ఎంత క‌ష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  ట్రీట్‌మెంట్ల కోసం లక్షలు ఖర్చు పెడితే.. బ్ర‌తుకుతారా అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి అత్యంత మెరుగైన ట్రీట్‌మెంట్ తీసుకున్నా... చాలా మంది చనిపోతున్నారు. ఇక గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ వల్లనే చాలా మంది చనిపోతున్నారు. అయితే ముందుగా క్యాన్స‌ర్‌ను గుర్తించి, చికిత్స తీసుకోక‌పోవ‌డ‌మే వ‌ల్లే ఎక్క‌వ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని చెప్పొచ్చు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. కుక్క‌లు క్యాన్స‌ర్‌ను ప‌సిగ‌ట్టేస్తాయంటే న‌మ్ముతారా..? అవును! నిజంగానే కుక్క‌లు క్యాన్స‌ర్ ను ప‌సిగ‌ట్టేస్తాయ‌ట‌.

 

మనిషి శరీరంలోని లేదా శారిరక ద్రవాలలలోని వైరస్లు, బ్యాక్టిరియా మరియు క్యాన్సర్ సంకేతాలను కూడా వాటికి ఉన్న వాసనను గ్రహించే శక్తి ద్వారా గ్రహించగలవ‌ని తాజాగా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. 75 ఏళ్ల ఓ వ్యక్తి చెవి వెనుకాల అయిన గాయం దగ్గర అతని పెంపుడు కుక్క నాలుకతో పదేపదే నాకుతూ ఉండడం వల్ల అతడు హాస్పిటల్ కి వెళ్లాడు. అక్కడ అత‌నికి ప‌రీక్ష‌లు చేయ‌గా.. క్యాన్సర్ అన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీనిని బ‌ట్టీ ఎటువంటి ట్రెయినింగ్ లేకపోయినా కూడా కుక్క అతడి క్యాన్సర్ ని గుర్తించగలిగింది. 

 

ఇక మనిషి శ్వాసను బట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ ను..మూత్రాన్ని బట్టి అండాశయ క్యాన్సర్ , ప్రోస్టేట్ క్యాన్సర్ ని గుర్తించగలవు.. శిక్షణ పొందిన కుక్కలు ప్రారంభ దశలోనే క్యాన్సర్లను ప‌‌రిశోధ‌న‌లో తేలింది.  అయితే రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి మాత్రమే కుక్కలకు శిక్షణ అవసరం అని అంటున్నారు ప‌రిశోధ‌కులు. కాగా, శునకంలా వాసన పసిగట్టే జంతువు ఈ ప్రపంచంలోనే లేదు అంటుంటారు.  కుక్కలు మనిషి కన్నా 10వేల రెట్లు ఎక్కువగా వాసనలను గ్రహిస్తాయి. అలాగే రక్తంలోని క్యాన్సర్‌ కణాలను సైతం కుక్కలు పసిగడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాబట్టి మీ పెంపుడు కుక్కలు మీతో మునుపటి మాదిరిగా కాకుండా కొత్తగా లేదంటే వింతగా ప్రవర్తిస్తున్నట్లైతే.. మీరు వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కి వెళ్తి ప‌రీక్ష‌లు చేయించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: