జీవితంలో తప్పులు చేయడం సహజం. తప్పులు చేయనివారు జీవితంలో ఎవరకూ ఉండరు. అయితే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నవారే గొప్పవారు.. యోగ్యులు.. మిగిలిన వారు తప్పులు గ్రహించక.. మళ్లీ వాటినే రిపీట్ చేస్తుంటారు.

 

 

పొంగితే చూడ్డానికి పూరీలు.. పొరబడ్డప్పుడు చెప్పడానికి సారీలు బావుంటాయి. మనం చేసిన చిన్న తప్పిదం తర్వాత వెంటనే.. " ఐ యామ్ సారీ " అని తడుముకోకుండా చెప్తాం. ఈ రోజుల్లో తప్పు చేసి సారీ చెప్పేయడం ఓ అలవాటుగా మారింది. కానీ ఆ సారీలో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ.. బాధ కానీ కనిపించవు.

 

 

అందువల్ల అలాంటి సారీలతో ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే సారీ చెప్తూనే "ఈ తప్పును సరిదిద్దుకోవడానికి నేనేం చేయాలి" ..అని అడుగుతారు. ఈ నడవడిక ఎదుటివారితో మన అనుబంధాన్ని మరింత అందంగా, నిజాయితీగా నిలబెడుతుంది.

 

 

అందుకే మీరూ ఓసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.. తప్పు చేసినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉందో గుర్తు చేసుకోండి. మీరు ఏ కోవకు చెందుతారో గ్రహించండి. తప్పు సరిదిద్దుకోండి.. అప్పుడు మీరు అందరికీ ప్రేమపాత్రులవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: