ప్రకృతి నుంచీ దొరికే అమృతం తేనే అంటారు మన పెద్దలు తేనే టీగలు పువ్వుల నుంచీ సేకరించే ఈ మధురాన్ని రుచి చూస్తే చాలు ఎంతో తెలియని అనుభూతి కలుగుతుంది. పల్లెలు అడవుల నుంచీ వివిధ రకాలుగా తేనే లభ్యమవుతుంది. తేనెలో ఎన్నో రకాలు ఉంటాయి. పుట్ట తేనే ఇది సహజసిద్దంగా అడవులలో దొరికుతుంది. మనకి మార్కెట్ లో లభ్యమయ్యే తేనెలు చాలా మటుకు వ్యవసాయ సాగులా చేసి సేకరిస్తారు. కొందరు రోడ్లపై తేనే తుట్టెని తీసుకువచ్చి మరీ తేనెని మార్కెట్ చేస్తూ ఉంటారు. కానే చాలామందికి ఉండే ధర్మ సందేహం ఏమిటంటే..

IHG

మార్కెట్ లో మనం కొనే తేనే స్వచ్చమైనదేనా కాదా. మంచే తేనే అని ఎలా గుర్తించాలి. వాళ్ళు అమ్మే తేనెలో పంచదార లేదా బెల్లం  పానకం కలుపుతారా అంటూ ఎన్నో సందేహాలు మనలో కలుగుతాయి. అయితే స్వచ్చమైన తేనెని గురించడానికి ఎంతో సులభమైన మార్గాలు  కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

IHG

స్వచ్చమైన తేనే కి మండే స్వభావం ఉంటుంది. అందుకే తేనే కొనే ముందు ఒక అగ్గిపుల్లని తీసుసుకుని దానిని తేనెలో ముంచి అగ్గి పుల్లని వెలిగించండి. అది గనుకా వెలిగితే అది స్వచ్చమైన తేనే అని గుర్తించండి. వాస్తవానికి బెల్లం పాకం లేదా పంచదార పాకం కలిపిన తేనే వెలగదు

IHG

ఒక గ్లాసు లో నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ తేనే కలపాలి. ఆ తరువాత అందులో కొంచం వెనిగర్ వేయాలి ఒక వేళ అందులోంచి నురుగు గనుకా వస్తే అది కల్తీ తేనేగా గుర్తించండి. ఇలాంటి పద్దతే మరొకటి ఉంది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ తేనే కలపండి. ఈ కలిపే విధానం కూడా చెంచాతో కాకుండా తేనే వేయగానే అటూ ఇటూ ఊపుతూ కలపాలి, ఇలా చేయగానే తేనే నీటిలో కలిసి పొతే అది కల్తీ తేనే గా గుర్తించండి. అదే తేనే గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే అది స్వచ్చమైన తేనే అని తెలుసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: