క‌రోనా వైర‌స్‌.. గ‌త ఏడాది డిసెంబ‌రులో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. కంటికి క‌నిపించ‌న ఈ అతిసూక్ష్మ‌జీవి.. ల‌క్ష‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంద. ఇక ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా కోటి మందికిపైగా క‌రోనా బారినపడ్డారు. వీరిలో ఐదు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. 

 

అలాగే ఇటలీలోని వయోవృద్ధుల్లో దాదాపు 75 శాతం మందిని మహమ్మారి తుడిచిపెట్టేసింది. అయితే ఈ ప్రాణాంత‌క కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్‌ ధరించడం ఎంత ముఖ్యమో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భౌతిక దూరం పాటించడం, హోం క్వారంటైన్ పాటించడం కంటే కరోనా వైరస్ కట్టడిలో మాస్క్‌లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.  ఈ మాస్క్ వల్ల మేలు ఎంత జరుగుతుందో నష్టం కూడా అంతే జరుగుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫేస్ మాస్క్ ఎప్పుడు కూడా కొంత స‌మ‌యం మాత్ర‌మే ధరించాలంటున్నారు. 

 

అలా కాకుండా.. ఎక్కువ‌ సేపు మాస్క్ ఉంచుకోవడం వల్ల రక్తం లో ఆక్సిజన్ తగ్గిపోతుంద‌ట‌. అదే స‌మ‌యంలో మెదడుకి కావాల్సినంత ఆక్సిజన్ సరఫరా జరగద‌ని అంటున్నారు. దీంతో నీర‌సంగా ఉండ‌డం.. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవ‌చ్చ‌ని అంటున్నారు. అలా అని మాస్క్ ధ‌రించ‌వ‌ద్ద‌ని అన‌డం లేదు.. ఒక్కరే ఉన్నప్పుడు మాస్క్ తీసెయ్యండి.  ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ అవసరం లేదు. ప్రజలు గుంపుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడూ, ఎవరితోనైనా దగ్గరగా ఉన్నప్పుడూ, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రమే మాస్క్ ధరించండి. ఇక కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్‌ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయడం కూడా అంతే ముఖ్యం. సో.. ఈ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: