మీ ఇంట్లో కోపతాపాలు, అలకలు, గొడవలు ఎక్కవయ్యాయా.. అవి మిమ్మల్ని బాధిస్తున్నాయా.. మరేం పర్లేదు. అవి మంచికే.. అదేంటి కోపతాపాలు, అలకలు మంచివి ఎలా అవుతాయి.. అంటారా.. కోపం , గొడవ , అలగడం ఎక్కడైతే ఉంటాయో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది ఇవేమీ లేవు అంటే అక్కడ నటన మాత్రమే ఉంటుంది.

 

 

ఇది చాలా మందికి తెలిసినా అర్థం చేసుకోరు . ఇవి ప్రతి ఇంట్లోనూ సహజం అన్న సంగతి గుర్తుంచుకోవాలి. దాన్ని హృదయ పూర్వకంగా స్వీకరించాలి. ప్రతి అలక తర్వాత వచ్చే ప్రతి ఉదయం మీ చక్కటి చిరు నవ్వుతో ప్రారంభం అవుతుంది. మీరెప్పుడు నవ్వుతు సంతోషంగా ఉండేందుకు కారణమవుతుంది.

 

 

నువ్వు ఒక్కసారే జీవిస్తావు కాబట్టి నీదైన శైలిలో జీవితాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించు.. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తలవంచుతుంది . మనిషి తనను తాను అర్థం చేసుకోక గమ్యం తెలియక అయోమయంలో ఉన్నాడు.. తనను తాను అర్థం చేసుకుంటే సర్వం సాధ్యమే

 

మరింత సమాచారం తెలుసుకోండి: