వారసులుగా మన పిల్లలకు ఏమి ఇవ్వాలి.. చాలా మంది ఏమిస్తాం.. మనం సంపాదించిన ఆస్తులు ఇస్తాం.. అనుకుంటారు. ఆస్తుల కంటే విలువైన చక్కని విద్య, నడవడిక, సంస్కారం అందిస్తున్నామా లేదా అన్న విషయంపై దృష్టి సారించాలి. బాల్యదశ తల్లిదండ్రుల సంరక్షణలో గడుస్తుంది. అందువల్ల పిల్లల పెంపకంలో శ్రద్ధ చూపవలసింది వారే.

 

 

పిల్లలు మనం చెబితే వినరు.. కానీ మనల్ని చూసి నేర్చుకుంటారు. అందుకే ముందు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. వారి ప్రతి చర్యనూ పిల్లలు చాలా బాగా గమనిస్తుంటారు. అందుకే పిల్లలు సద్గుణాలు నేర్చుకునేట్టు పెద్దల ప్రవర్తన ఉండాలి.

 

 

చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెంపకం అంటే తిండి, గుడ్డ, ఇతర సౌకర్యాలు, చదువు మాత్రమే అనుకుంటారు. వీటి కంటే ఎంతో ముఖ్యమైనది సంస్కారం. సంస్కారం నుంచే సత్ప్రవర్తన వస్తుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. అన్న విచక్షణ పిల్లలకు కలగాలి.

 

 

వీటి కోసం మనం ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వనక్కర్లేదు.. మనం ఆచరించి చూపుతూ.. వారికి వీలైనప్పడల్లా ఉదాహరణగా మారుతూ వివరించాలి. ఓ స్నేహితుడిలా వారికి మార్గనిర్దేశనం చేయాలి. అప్పుడే వారి వ్యక్తిత్వం వికసిస్తుంది.. వారి జీవితం పూలబాట అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: