క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా క‌రాళ నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ అల్లుకుంటోంది కరోనా. ఇప్పటి వరకు ఈ క‌రోనా భూతానికి వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాకపోవడంతో మరణాలు సంఖ్య, పాజిటివ్ కేసులు సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య అయిదు లక్షల మార్క్‌ను దాటేసింది. అలాగే పాజిటివ్ కేసు సంఖ్య సైతం కోటి మించిపోయింది. ఇక  రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఈ మ‌హ‌మ్మారి ఉధృతి ఎక్క‌డ త‌గ్గ‌లేదు.

IHG

అయితే ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో కొంద‌రు చేసే చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల రిస్క్‌లో ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా కరోనావైరస్ వ్యాప్తి నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముసుగు ధరించాలని ప్రభుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు విజ్ఞ‌ప్తి చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. బ‌య‌ట తిరిగేస్తున్నారు. దీని వ‌ల్ల మీరు ప్ర‌మాదంలో ప‌డ‌డ‌మే కాకుండా.. మీ కుటుంబ‌స‌భ్యులు కూడా రిస్క్‌లో ప‌డ‌తారు. అలాగే కొంద‌రికి క‌రోనా పాజిటివ్ అని వ‌చ్చినా.. వారిలో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు.

IHG

అయితే ఇలాంటి వారు త‌మ‌లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేదు క‌దా అని ఇత‌రుల‌తో నిర‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే.. వారికి సైతం క‌రోనా సోకే ప్ర‌మాదం ఉంది. ఇక కరోనా వైరస్ మీకు వ్యాపించకుండా ఉండటానికి మీరు సామాజిక దూరాన్ని అనుసరించాలి. కానీ, కొంద‌రు మాత్రం ఇవేమీ ప‌ట్టించుకోకుండా.. రిస్క్‌లో ప‌డుతున్నారు. అలాగే బహిరంగంగా ఏదైనా వ‌స్తువును తాకినట్లయితే లేదా కూరగాయలను కొనుగోలు చేస్తే.. మీకు కరోనావైరస్ సోకే అవ‌కాశాలు ఉన్నాయి. అందుకే మీరు బయటికి వెళ్ళినప్పుడు.. మీ వెంట శానిటైజర్‌ను కూడా తీసుకువెళ్లండి.
  

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: