మనం ప్రతిరోజు ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగేస్తాం. ఇంకా అలా టీ కాఫీ తాగడం కంటే కూడా గ్రీన్ టీ ఎంతో మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. ఇకపోతే మానసిక ఒత్తిడికి గురవుతున్న వారు చామంతి పూలతోనూ టీ చేసుకొని తాగితే ఒత్తిడి తగ్గుతుంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 

 

మరి ఆ టీ ఎలా చెయ్యాలి.. దాని వల్ల లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. రోజు ఈ టీ తాగి ఒత్తిడిని తగ్గిద్దాం. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

కప్పు నీళ్ళు, 

 

కొద్దిగా టీ పొడి, 

 

ఎండిన చామంతి రెక్కలు,

 

ఒక నిమ్మరసం, 

 

ఒక స్పూన్ తేనే.  

 

తయారీ విధానం.. 

 

కప్పు నీళ్లు ఒక గిన్నిలో పోసి అందులోకి కాస్త టీ పొడి వెయ్యాలి. ఇంకా అవి బాగా మరిగాక ఒక కప్పులో తాజా లేదా ఎండిన చామంతి రేకలు వేసి ముందు కాచిన వేడివేడి టీ ని అందులో పోసి కలిపి 2 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇంకా ఆ తర్వాత దాన్ని మరో కప్పులోకి వడగట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే సువాసనతో కూడిన చామంతి టీ రెడీ. ఇంకా ఈ టీ తాగితే అధిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోతారు. 

 

చామంతి టీతో లాభాలు..  

 

ఈ టీ తో కళ్లకింద వాపు, నల్లని వలయాల సమస్య దూరమవుతుంది. కంటిమీది ఒత్తిడీ దూరమవుతుంది.

 

చామంతి టీలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీర రోగ నిరోధక శక్తిని అధికంగా పెంచుతుంది. 

 

చామంతి టీ వల్ల చర్మం తాజాగా మారటమే గాక కాలిన గాయాలు, దోమకాటు దద్దుర్లు కూడా తగ్గుతాయి.

 

ఓ కప్పు చామంతి టీ తాగితే తలనొప్పి తగ్గి ఒత్తిడి మాయం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: