మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అక్ష‌రాల నిజం. కానీ, రెడ్ వైన్‌కు మాత్రం ఇది వ‌ర్తించ‌ద‌నే చెప్పాలి. అది కూడా కెమికల్ బేస్డ్ ఆల్కహాల్ కు బదులుగా గ్రేప్ వైన్, యాపిల్ వైన్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాల‌ను చేకూర్చుతుంది. ఎందుకంటే.. ఇందులో ఉండే ప్ర‌త్యేక గుణాలే కార‌ణం. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు కూడా చెబుతున్నారు. మ‌రి ఏ టైమ్‌లో వైన్ తీసుకోవాలి..? అన్న‌ది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

 

సాధార‌ణంగా రోజూ రాత్రుళ్లు ఒక గ్లాస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు. వైన్ తాగితే ఉండే మొదటి బెన్ ఫిట్ ఎక్కువ కాలం బతకడం. మీరు రోజూ రాత్రిపూట ఒక గ్లాస్ వైన్ తాగితే చాలు మీ ఆయుష్షు పెరుగుతుంది. అలాగే రెడ్ వైన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట. రెడ్ వైన్ లో ఆమ్లజనకాలు ఉంటాయట. అవి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడనీయకుండా చేస్తాయి. రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి. 

 

అదేవిధంగా, రాత్రిపూట మితంగా తీసుకొనే రెడ్ వైన్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. మరియు లంగ్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయ‌ప‌డుతుంది. రెడ్ వైన్ ను రాత్రుల్లో తాగడం వల్ల నాడీవ్యవస్థకు విశ్రాంతి కలిగి, స్ట్రెస్ తగ్గుతుంది. దాంతో నిద్ర సైతం బాగా పడుతుంది. ఇక రెడ్ వైన్ తాగడం వల్ల ముఖ కండరాలు వదులవుతాయి. అంతేకాకుండా మంచి కలర్ వస్తారు. మరింత ప్ర‌కాశ‌వంతంగా కనిపిస్తారు. మ‌రియు రెడ్ వైన్ లో ఉండే రిచ్ యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం అవుతుంది. ఏజింగ్ కు కారణమయ్యే సెల్స్ ను నివారిస్తుంది. అయితే తాగ‌మ‌న్నారు క‌దా అని ఓవ‌ర్‌గా తాగితే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా మితింగా తీసుకుంటేనే మంచి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: