మాన‌వ మ‌నుగ‌డ‌కు నీరు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందుకే దాదాపు చాలా మంది ఉద‌యం ఒక గ్లాసు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు తాగి.. త‌మ రోజును మొద‌లుపెడ‌తారు. ఇక నిమ్మకాయ అంటే తెలియని వారుండరు, అది కాస్త పుల్లగా ఉన్నప్పటికీ తినే వాళ్లు కూడా ఉంటారు. నిమ్మకాయతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే నిమ్మ‌ర‌సం వేడి నీటిలో క‌లిపి చాలా మంది తాగుతుంటారు.

 

అయితే కొంద‌రు మాత్రం ఇలా తాగ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ, ఇలా వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజనాలు క‌లుగుతాయి. నిమ్మ‌ర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం వ‌ల్ల చాలా ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు తేలిగ్గా తగ్గిపోతాయి.

 

వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే, బాడీలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగవుతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి. అలాగే రోజూ నిమ్మ‌ర‌సాన్ని తాగితే వయస్సు మీద పడుతుండడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. మ‌రియు వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దక స‌మ‌స్య త‌గ్గుతుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా  మాయమవుతాయి. ఇక ఉద‌యాన్ని వేడి నీటితో నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో క‌వ్వు క‌ర‌గాలంటే ఖ‌చ్చితంగా వేడి నీటితో నిమ్మ‌ర‌సం తాగాల్సిందే.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: