గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగుచూసిన ప్రానాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఎప్పుడు..? ఎలలా..? ఈ ప్రాణాంత‌క మహమ్మారి అంత‌మ‌వుతుందో తెలియ‌క దేశ‌దేశాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. శ‌ర‌వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్ర‌పంచ‌దేశాలు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. లాక్‌‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నాయి.

 

అయిన‌ప్ప‌టికీ క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత వేగంగా విస్త‌రిస్తోంది. మ‌రోవైపు క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ‌దేశాల్లోని ఎంద‌రో శాస్త్ర‌వేత్త‌లు రాత్రి, పగలు అని తేడా లేకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌లితం ద‌క్క‌లేదు. ఇక‌ క‌రోనా భూతాన్ని ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు నిపుణులు హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందులో ముందుగా.. ప్ర‌తి వేడి నీరు తాగడం అంటే.. కొద్దిగా నీరు తీసుకుని వేడి చేసి.. అందులో అల్లం ముక్క లేదా లవంగం వేసి మ‌రిగించి తీసుకోవాలంటున్నారు. 

 

ఇలా ప్ర‌తి రోజు ఉద‌యం చేయ‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే పిప్పరమెంట్ తీసుకుని.. దీనిపై కాస్తా తేనె రాసి నాలుకపై రాయండి. ఇలా చేయడం వల్ల రోగ‌నిరోధ‌కశ‌క్తి పెరగడమే కాదు.. శ్వాసకోశ కరోనా వైరస్‌ నుంచి రక్షించే సామర్థ్యం శరీరానికి లభిస్తుంద‌ని అంటున్నారు. అలాగే చిన్న అల్లం ముక్క. పావు టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ పసుపు, ఒక‌ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా నిమ్మరసం.. వీటన్నింటిని లీటర్ నీటిలో బాగా మ‌రిగించి.. ప్ర‌తిరోజు తాగాలి. ఇలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరగడమే కాదు.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: