కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చుతోంది. లక్షలాది మంది ప్రజలు  ప్రాణాలు పోగొట్టుకుంటుంటే..కోట్లాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. మరి కొందరు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తమకే కాకుండా తోటి ప్రజల కి కూడా ఈ మహమ్మారిని అంటించేస్తున్నారు. ఎన్నో దేశాలలో ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు ప్రజలకి తెలియజేయక పోవడం వలన ఆయా దేశాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కానీ భారత దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచీ సామాజిక దూరం పాటించమని, మాస్క్ లు ధరించమని , అవసరమైతేనే బయటకి రావాలని ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్పడంతో కరోనా కాటు నుంచీ బయటపడగలిగాము..అయితే

IHG

జనతా కర్ఫ్యూ లో యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మనం ప్రస్తుతం ఎంతో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతో రోజు రోజుకి దేశ వ్యాపితంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మృతుల సంఖ్య కూడా భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క వైద్యులు అలుపెరుగకుండా కరోనా భాదితులకి సేవలు చేయడంతో వారు కూడా కరోన బారిన పడి చనిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేవలం వైద్యులే కాదు వైద్య సిబ్బంది సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..దీనికి ఏకైక కారణం కేవలం బాధ్యతా రాహిత్యమే..

బయటకి వెళ్ళే సమయంలో మనం మాస్క్ పెట్టుకుని వెళ్ళలేమా...?? జనతా కర్ఫ్యూలో చూపించిన స్పూర్తి ఇప్పుడు ఏమయ్యింది...?? వైద్యులు ఎంతో కష్టపడి ప్రాణాలకి తెగించి మరీ మనకోసం శ్రమిస్తుంటే మనం మాత్రం ఇప్పటికీ మాస్క్ లు ధరించడం , సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత విషయాలలో నిర్లక్ష్యంగానే ఉంటున్నాము. ఈ కారణంగానే కరోనా కేసులు పెరిగిపోయే వైద్యులపై , వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోంది. తమ ఉద్యోగ ధర్మాని పాటిస్తూనే కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న ప్రస్తుత పరిస్థితులలో మరింత సమయాన్ని వెచ్చిస్తూ కుటుంభాలకి సైతం దూరంగా ఉంటూ కరోనా రోగులకి సేవలు అందిస్తున్నారు..అంతేకాదు కరోనా సోకకుండా వారు తీసుకునే జాగ్రత్తలు వారు ధరిస్తున్న వ్యక్తిగత సంరక్షణ పరికరాలు, వాటి వలన వారు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు..

IHG

కేవలం మాస్క్ ధరించడానికే అల్లల్లాడి పోతున్న చాలా మందికి వైద్యులు వారి వ్యక్తిగత రక్షణ కిట్లు ధరించడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా. కుటుంభ జీవితానికి  దాదాపు నెలల పాటు దూరంగా ఉంటూ ఎంతటి వేదనని అనుభవిస్తున్నారో తెలుసా. కానీ మనం మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే రోడ్లపై తిరిగేస్తున్నాం. వైద్యుల మనో వేదన, వారు మనకి సేవలు చేయడంలో పడుతున్న కష్టం మీరు ఈ వీడియోలో చూడవచ్చు..

వైద్యులు వారికి కరోనా సోకకుండా ఉండేదుకు పీపీఈ కిట్ ధరించి కరోనా రోగులకి సేవలు అందిస్తూ ఉంటారు. ఈ కిట్ ధరించి  మనం నిమిషాల పాటు కూడా ఉండలేము. కానీ వైద్యులు మాత్రం గంటల తరబడి ఇదే కిట్ లో ఉంటూ ఎంతో భాద్యతగా మనకి సేవలు అందిస్తున్నారు. ఈ కిట్ ధరించి ఉన్నంత సేపు వారి వద్ద కేవలం వైద్య పరికరాలు మాత్రమే ఉంటాయి తప్ప వ్యక్తిగత వస్తువులు ఉండవు. ఈ కిట్ ధరించి మళ్ళీ తీసే వరకూ కూడా వారు పడే కష్టంలో ఒక్క శాతం అయినా మనం పాటిస్తే కరోనాని తరిమి తరిమి కొట్టచ్చు..ఇకపై అయినా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ..వ్యక్తిగత శుభ్రతతో కరోనాకి దూరంగా ఉంటారని..ఆశిస్తున్నాము.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: