ఒక వ్యక్తికి అసలైన బలం ఏది.. ఓ వ్యక్తి దేని కారణంగా సంతోషంగా ఉంటాడు.. ఓ వ్యక్తి దేని కారణంగా జీవితంలో వృద్ధి పథంలో పయనిస్తాడు.. దీనికి సమాధానం మనం చూసే.. మనంలో ఆలోచించే దృష్టి కోణమే.. మనం ఎలా ఆలోచిస్తామో.. అలాగే తయారవుతాం అంటారు. 

 


ఓ వ్యక్తి పరమ తాగుబోతులా తయారయ్యాడు.. జీవితాంతం తాగుడే వ్యసనంగా బతికాడు. అతడి భార్య, ఇద్దరు కుమారులు అతని వల్ల అష్టకష్టాలు పడ్డారు. ఆ వ్యక్తి రోజూ తాగి వచ్చి పెళ్లాం పిల్లలను చితకబాదేవాడు.. కాలక్రమంగా ఆ పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. వారిలో ఒకడు తండ్రిలా తాగుబోతుగానే మారాడు. 

 

IHG


మరొకడు చాలా బుద్ధి మంతుడై జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చినా ఈ మార్పు ఎలా సాధ్యమైంది.. అంటారా.. ఇదే విషయం తాగుబోతుగా మారిన వ్యక్తిని అడిగితే.. ఏమంటాడో తెలుసా.. మా నాన్న పచ్చి తాగుబోతు.. రోజూ తాగి వచ్చి మమ్మల్ని కొట్టేవాడు.. అందుకే నేనూ అలాగే తయారయ్యాను  అంటున్నాడు. 

 

IHG


జీవితంలో బాగుపడిన రెండో కొడుకును అడిగితే.. వాడు ఇలా అంటున్నాడు.. మానాన్న పచ్చి తాగుబోతు.. రోజూ వచ్చి మమ్మల్ని కొట్టేవాడు.. అందుకే నేను అలా కాకూడదని పట్టుదలగా చదువుకున్నాను.. ఇలా మంచి ఉద్యోగం సంపాదించాడు అంటున్నాడు. అంటే కొడుకులు ఇద్దరూ ఒకే తండ్రిని విభిన్న కోణాల్లో ఆదర్శంగా తీసుకున్నారు.. అందుకే మీరు ఆలోచించే శక్తి.. మీ ఆలోచనాధోరణే మీ అసలైన బలం. మీ  ఛోదక శక్తి. 

మరింత సమాచారం తెలుసుకోండి: