పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఒకే ఒక్క సారి పండగ. దీనితో రెండు విభిన్న ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి జీవించే బోయే సమయం. పెళ్లయిన తొలిరోజుల్లో భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయిస్తూ హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే కొన్ని రోజులకు ఈ దగ్గరితనం కాస్త క్రమక్రమంగా దూరమైపోతుంది. మరికొందరికి వారిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా కొండంతగా పెరిగిపోతాయి. చిన్న సమస్య అయినా సరే... విడాకుల వరకూ వెళ్ళే రోజులివి. అయితే వీటికి పరిష్కారం లేదా అని అనుకుంటే....

<p>కాంప్లిమెంట్స్..</p>

<p>ఒక మెచ్చుకోలు.. ఎంతో తృప్తిని ఇస్తుంది. వాళ్లు మీకోసం ఏదైనా చేసినా, అందంగా రెడీ అయినా.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం లాంటివి చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది.</p>


ముఖ్యంగా మీ పార్ట్నర్ తో ఆనందంగా జీవించాలంటే వారు మీకు వారు ఎంత ముఖ్యమో వారికి తెలియజేయాలి. నిజానికి చాలామంది వారి ఫీలింగ్స్ ఉన్న సరే వారిలోనే దాచుకుంటారు. అలా కాకుండా వాటిని ఎక్స్ ప్రెస్ చేస్తే మీ జీవిత భాగస్వామితో ఇలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. పెళ్లికి ముందు లాగా పెళ్లి తర్వాత కూడా ఫోన్ లో చాటింగ్ చేసే విధంగా ఉంటే మీరు అందులో ప్రేమకు సంబంధించిన సందేశాలు కూడా పంపిస్తే మీ మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతాయి.

 

అయితే కొన్ని విషయాలను మాటల్లో చెప్పలేనిది కౌగిలింతలతో వారికి అర్థమయ్యేలా చెప్పవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీలైనప్పుడల్లా మీ పార్టనర్ కి హాగ్ ఇవ్వడానికి ప్రయతించండి. అంతేకాకుండా వారు చేసే పనులలో ఏదైనా మీకు నచ్చితే వారికి కంప్లిమెంట్ ఇవ్వడం ద్వారా మీ భాగస్వామికి ఆనందాన్ని కల్పించవచ్చు. వీటితో పాటు మీ పార్టనర్ తో ఎప్పుడూ నిజాయితీగా ఉండేవిధంగా ప్రయత్నించండి. నిజాయితీ మీదే మీ కుటుంబాలు నిలబడతాయి అన్న విషయాన్ని గ్రహించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: