కంటికి క‌నిపించ‌ని ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనాలో మొదలై ఈ క‌రోనా ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే 5.47 ల‌క్ష‌ల మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు. అయితే ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తుండ‌డంతో.. ఈ మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించుకోవ‌డం కోసం మాస్క్‌ ధరించడం చాలా ముఖ్యం అయ్యింది.

IHG

భౌతిక దూరం పాటించడం, హోం క్వారంటైన్ పాటించడం కంటే కరోనా వైరస్ కట్టడిలో మాస్క్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ను మాస్క్‌ రక్షణ కవచంలా కాపాడుతోంది. అయితే మాస్క్ ధ‌రించే స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. లేదంటే ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు నిపుణులు. మాస్క్ ధరించే ముందు చేతులు ఖ‌చ్చితంగా శుభ్రం చేసుకోండి. అనంత‌రం మాస్క్ ధ‌రించాలి. బ‌య‌టే కాదు ఇంట్లో ఉన్న స‌మ‌యంలో అయినా మీకు దగ్గు మరియు తుమ్ము ఉన్నప్పుడు, మాస్క్ ఖ‌చ్చితంగా ధరించండి.

IHG

తద్వారా అది వేరొకరికి వ్యాప్తి చెందకుండా చేస్తుంది. మాస్కులను ధరించేటప్పుడు ముక్కు, నోరు కప్పి ఉండేలా చూసుకోవాలి. ఇక ఒక‌సారి మాస్క్ ధ‌రించాక‌.. ప‌దే ప‌దే ఆ పాంత్రంలో తాకవద్దు. దీని వ‌ల్ల క‌రోనా వ‌చ్చే రిస్క్ ఎక్కువ‌. మ‌రియు చేతిని తరచుగా సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్క్‌ను తీసేస‌మ‌యంలో ముందు భాగం నుంచి తాక‌కుండా.. వెనుక‌భాగం నుంచి రెండు వేళ్లతో తీయాలి. ఆ వెంట‌నే దాన్ని చెత్తబుట్టలో పారేయండి. ఆపై మీ చేతులను సబ్బు లేదా హ్యాండ్‌వాష్‌తో కడగాలి. ఇక మీరు ఉపయోగించిన మాస్క్‌ మరెవరూ ఉపయోగించకుండా చూసుకోవాలి. 

 
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: