మీరు మంచి వాళ్లే కావచ్చు.. మీరు చీమకు కూడా అపకారం తలపెట్టని వారు కావచ్చు... మీకు ఎవరికీ హాని చేయాలని ఉండకపోవచ్చు.. కానీ ఒక్కోసారి మీరు చాలా తప్పు పనులు చేస్తారు.. మహాపరాధాలు చేస్తారు.. బహుశా అలాంటి తప్పులు చేసినందుకు ఆ తప్పులతో బాధపడిన వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేకపోవచ్చు.. 

 

 


అదేంటి.. నేను మంచి వాడిని మొర్రో అంటే తప్పులు చేస్తానని అంటున్నారేంటి అనుకుంటున్నారా.. నిజమే.. నేను చెబుతున్నది వాస్తవమే. మీరు మంచి వారే కావచ్చు. కానీ మీ చుట్టూ కూడా మంచివాళ్లు ఉండాలని రూలేమీ లేదుగా.. మీరు ఎవరి మాటల ద్వారానూ ప్రభావితం కాని వారని చెప్పలేం కదా.. అలా చెప్పుడు మాటలు వినడం వల్ల లోకంలో చాలా అనర్థాలు జరిగాయి. 

 

 


మేం నమ్మం అంటారా.. ఒక్కసారి మన పురాణగాధలు తిరగేయండి.. రామాయణం తీసుకుంటే...
రామచంద్రుడికి కన్నతల్లి కౌసల్య ఎంతో, పెంపుడు తల్లి కైక కూడా అంతే.. కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ కూడా.. నడక నేర్చిన రాముడు మాట్లాడితే కైక మందిరంవైపు అడుగులు వేసేవాడట. నిద్ర నుంచి మేలుకోగానే కైక రాముడు లేచాడా లేదా... అంటూ కౌసల్య అంతఃపురంలోకి పరుగులు తీసేదట. 

 


మీకో విషయం తెలుసా.. రాముడికి తొలుత విల్లు పట్టడం నేర్పిన గురువు కైకమ్మే. ఎందుకంటే విలువిద్యలో ఆమె గొప్ప ప్రవీణురాలు. రాముడికి ఆమెకు  పట్ల అవ్యాజమైన ప్రేమ ఉండేది. కైకేయికీ అంతే. సొంత కొడుకు భరతుడి కన్నా రాముడంటేనే కైకకు ఎక్కువ ఇష్టం. అయినా అంతటి ప్రేమ మూర్తి కైక.. దాసి మంధర మాటలకు లొంగిపోయింది. ఆమె చెప్పినట్టాల్లా నడచుకుంది. రాముడిని అడవికి పంపింది. మరి మీ చుట్టూ కూడా అలాంటి వాళ్లు ఉన్నారా.. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాంటి వాళ్లను గుర్తించడం కాస్త కష్టమే.. కానీ తప్పదు.. లేకపోతే.. మీ వ్యక్తిత్వం ప్రభావితం అవుతుంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: