ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నాయి. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 20 ల‌క్ష‌లు దాటేసింది. మ‌ర‌ణాల సంఖ్య‌ సైతం అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. మ‌రోవైపు కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్ర‌పంచ‌దేశాల్లోనూ పరిశోధనలు ముమ్మ‌రంగా జరుగుతున్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే క‌రోనా నుంచి ర‌క్షించుకోవాల‌న్నా.. క‌రోనాతో యుద్ధం చేయాల‌న్నా.. రోగ‌నిరోధ‌క శ‌క్తి బ‌లంగా ఉండాలి.

IHG'giving up' on convincing kids to eat <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DRY FRUITS' target='_blank' title='fruit-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>fruit</a> and ...

నిపుణులు కూడా రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని సూచిస్తున్నారు. దీంతో చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుంటే. కొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే వాటిలో పైనాపిల్ కూడా ఒక‌టి. అవును! పైనాపిల్‌తో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా కరోనా వైరస్‌పై పోరాడే శక్తిని కూడగట్టుకోవచ్చు. కొంచెం తియ్యగా.. కొంచెం పుల్లగా.. తింటుంటే తినాలనిపించే పైనాపిల్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. 

IHG

పైనాపిల్‌లో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియం, మాంగనీస్, కాపర్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మెుత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్లే. దీనితో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మ‌రియు ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇక దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు పైనాపిల్ తింటే మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాకుండా..  రక్తహీనతకు పైనాపిల్‌ జ్యూస్‌ మంచి టానిక్‌గా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేసి జీర్ణ అవయవాలను బలపరుస్తుంది. సో.. ఖ‌చ్చితంగా పైనాపిల్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: