ఏమే పిల్లా అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు.. గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనే సుక్కల తానాలు.. ఈ మధ్య కాలంలో తెలంగాణలోనే కాదు.. యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నపాట.. ఈ పాట క్రేజ్ చివరకు ఈటీవీ జబర్దస్‌ వేదికనూ తాకిందంటే..అది ఆ పాట పాడిన తెలంగాణ కోయిగా పేరు తెచ్చుకుంటున్న శిరీష గాత్ర మాధుర్యం మహత్యమే. ఈ మధ్యకాలంలో ఏ టిక్ టాక్ విడియో చూసినా యేమే పిల్ల పాటనే.. ఏ రింగ్ టోన్ విన్న శిరీష పాటనే వినిపిస్తోంది. 

 


జనవరిలో యూట్యూబ్‌లో అడుగు పెట్టిన ఏమే పిల్లా పాట.. ఇప్పటికే 80 మిలియన్ల పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఓ జానపద యూట్యూబ్ సాంగ్‌ ఈ రేంజ్‌లో హిట్ కావడం మామూలు విషయం కాదు.. సినిమా పాటలనే మైమరిపిస్తున్న ఈ తెలంగాణ కోయిల శిరిష మాత్రం ఆ క్రెడిట్ అంతా జానపదానిదే అంటోంది  అందులో నా గొప్పతనమేమి లేదని..తెలంగాణ జానపదాల గొప్పతనమేనంటోంది. ఆ జానపదాలను పాడుతూ వింటూ ఆధారించే తెలంగాణ ప్రజలది గొప్పహృదయమనే చెప్తానంటోంది. 

 


ఇంతకీ ఈ తెలంగాణ కోయిలది చేనేత చీరలకు పట్టుకొమ్మ సిరిసిల్ల.. అక్కడే తన బాల్యమంతా ఇక్కడే గడిచింది. ఆమె ఇంటర్ వరకూ చదివింది. తానేం చేసినా మొదట నుంచి నాన్ననే ఎంకరేంజ్ చేశారంటోంది. అందుకే తానే తన మొదటి హీరో అంటోంది. అలాగే.. తన భర్త శివ వేల్పుల కూడా తనకు ఇంత పేరు వచ్చేందుకు కారణం అంటోంది. శివ ఏదీ చేసినా నా మంచికోసమే చేస్తాడని నమ్మానని.. అప్పటినుండే తన ఎదుగుదల ప్రారంభమైందంటోందీ శిరీష. 

 

 

తాను హాస్టల్‌ లో ఉండి చదివేటప్పుడే పాటకు బాటపడిందని..  హాస్టల్ లో డ్యాన్స్ టీచర్ గడ్డం దేవయ్య సర్ పాటలు పాడించేవారని గుర్తు చేసుకుంటోంది. అత్త కొడుకా ముద్దుల మారేలయ్య, టిక్కు టాకుటిక్కు, యేమే పిల్ల అన్నప్పుడల్ల, బాల పరుశరామా, వచ్చన్న పోరా బావా,పొడిపొడి వానలు కురువంగా, రామ సక్కనోడా నా రాములు,రాజు రాజు ,అత్తగారింటికి కొత్తగా ఒతున్న వంటి పాటల తనకు పేరు తెచ్చాయని గుర్తు చేసుకుంటోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: