ఓ చాయ్‌ వాలా.. ఈ దేశానికి ప్రధాన మంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా.. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.. కష్టపడి ఓ లక్ష్యం దిశగా సాగిపోతే అసాధ్యం అంటూ ఏదీ ఉండదని నిరూపించారు. భారత చరిత్రలో ఇంతటి కిందిస్థాయి నుంచి వచ్చిన ప్రధానమంత్రి చాలా అరుదు. గుజరాతీ అయిన మోడీ వాద్‌నగర్‌లో పుట్టారు. జీవితంలో చిన్ననాటి నుంచే అనేక కష్టాలు పడ్డారు. తండ్రి టీ స్టాల్‌లో సాయం చేస్తూ ఆయన కూడా సొంతంగా మరో టీ స్టాల్ పెట్టుకున్నారు. 

 

IHG


ఇక మోడీ రాజకీయానికి పునాది అతని ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమే.  ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడే ఆర్ఎస్ఎస్‌లో చేరిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీయే జీవితంగా బతికారు. 
తెలిసీ తెలియని వయస్సులో వివాహం అయినా.. ఆయన సంసార జీవితంలో బందీ కాలేదు. జీవితాన్ని పూర్తిగా పార్టీకే అంకితం చేశారు. పార్టీలో ఆయన చేయని పనులు లేవు..ఆఫీసు బాయ్ నుంచి పార్టీ అత్యున్నత పీఠాల వరకూ అన్నీ అధిరోహించాడు. 

 

IHG


మోడీ రాజకీయ జీవితంలో ఎన్నో విశేషాలు.. ఆయన మొదటిసారి గుజరాత్‌  అసెంబ్లీకి ఎన్నికైన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. అనూహ్యంగా సీఎం అయినా.. తన శక్తియుక్తులతో గుజరాత్‌ను దేశంలోనే అగ్రపథంలో నిలిపి దేశం దృష్టిని ఆకర్షించారు. వరుసగా ఎన్నికల్లో తాను గెలుస్తూ.. పార్టీని గెలిపిస్తే.. గుజరాత్‌లో బీజేపీని తిరుగులేని శక్తిగా మలిచారు. 

 

IHG


ప్రధానమంత్రిగానూ  అదే శైలి.. ఎంపీ అయిన తొలిసారే.. ఏకంగా ప్రధాని కూడా అయ్యారు. 2014లో భారతీయ జనతా పార్టీని విజయపథంలో నడిపారు. , 2019లో రెండోసారి అద్భుతమైన మెజారిటీతో పార్టీని గెలిపించి తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. తన పాలనలో అనేక ఆశ్చర్యకరమైన, అద్భుతమైన ఫలితాలు సాధించారు. సాధిస్తున్నారు. మోడీతో, ఆయన రాజకీయ సిద్ధాంతాలతో విబేధించేవారు ఉండొచ్చు.. కానీ.. ఆయన జీవితంలో విజేతగా ఎదిగిన తీరు మాత్రం నభూతో.. నభవిష్యత్‌. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: