ఒబేసిటీ అంటే.. ఒంట్లో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవటం. అయితే సాధారణంగా ఈ కొవ్వు పొట్ట భాగంలో ఎక్కువ‌గా ఉంటుంది. నేటి కాలంలో ఈ స‌మ‌స్య వ‌ల్ల చాలా మంది బాధ‌పుడుతున్నారు. రెగ్యులర్ డైట్ లో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం కారణంగా చాలా మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఈ ఒబేసిటీ వ‌ల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్, నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 

ఇక తాజాగా జ‌రిపిన ఓ అధ్య‌య‌‌నంలో ఒబేసిటీ గురించి మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పొట్ట పెరిగే కొద్దీ మెదడులోని మెమొరీ తగ్గిపోతుందని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెదడులో డెమెంటీయా అంటే మతిమరుపు తరహా వ్యాధికి దారి తీస్తుందని తాజాగా జ‌రిపిన అధ్య‌య‌నంలో తేలింద‌ట‌. అందేకాదు, ఒబేసిటీ విష‌యంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా శరీరాన్ని కబళించి, ఆరోగ్యాన్ని అధఃపాతాళానికి తోసేస్తుంది. కాబట్టి ఒబేసిటీకి గురికాకుండా ఉండాలంటే, తీసుకునే క్యాలరీల మొదలు సాగించే జీవనశైలి వరకూ అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. 

 

ఒక‌వేళ ఇప్ప‌టికే ఒబేసిటీతో బాధ‌ప‌డుతున్న‌వారు అయితే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డం మంచిదంటున్నారు. ఇక సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచాలి. అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మ‌రియు మద్యం తాగడం, చిరుతిళ్ళు, స్వీట్స్‌ తినడం త‌గ్గించుకోవాలి. ఇక ఎక్కువసేపు కూర్చొని ఉండేవారికి పొట్ట భాగం అధికంగా ఉంటుంది. కాబ‌ట్టి, ఎక్కువ‌సేపు కూర్చునే వారు మ‌ధ్య మ‌ధ్య‌లో ఖ‌చ్చితంగా పైకి అటు ఇటు న‌డ‌వాల‌ని అంటున్నారు. అలాగే వెల్లుల్లి, అల్లం, నిమ్మ వంటివి డైట్‌లో చేర్చుకుంటే ఈ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: