• మాట తీరు మనిషి సంస్కారానికి
గీటురాయి.
• మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా
వాడాలి.
• ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని,
నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను
అదుపులో ఉంచు కోగలిగితే మన జీవితం
అదుపు తప్పకుండా ఉంటుంది.
• నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే,
అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
• నోటిని అదుపులో పెట్టుకుని అందరితో
మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా
నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా,
ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
• చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా,
మనిషి సారం అతడి మాటలో తొంగి
చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట
తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
• మనిషికి నిజమైన అలంకారం అతడి
మాట తీరే.
• వాగ్భూషణం భూషణం
• కేయూరాణి న భూషయంతి పురుషం హారా
న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా
సంస్కృతాధార్యతే క్షీయన్తే ఖలు భూషణాని
సతతం వాగ్భూషణం భూషణం.
• ఇది భర్తృహరి నీతి శతకంలో విద్వత్పద్ధతిని
చెప్పే శ్లోకాల్లో ఒకటి. *వాగ్భూషణమొక్కటే
మనిషికి సుభూషణం* అన్నాడుభర్తృహరి.
* సంభాషణం
* మిత భాషణం
* హిత భాషణం
* స్మిత భాషణం
* ప్రియ భాషణం
* పూర్వ భాషణం
సత్య భాషణం అయినప్పుడు
అంతకన్నా భూషణం మరొకటి లేదు.
• మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి
గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.
• ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ
ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద
లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు
మంచిదవుతుంది కదా. ప్రియంగా
మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా
మనమే పలకరించడం పూర్వ భాషణం.
• సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా
సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా,
నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా
మాట్లాడాలి.
• ఆలోచించకుండా మాట్లాడటం, గురి
చూడకుండా బాణం వేయడం లాంటిది.
మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన
అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి
ఆచి తూచి మాట్లాడాలి.
• తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు
తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో
తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు
అన్నారు స్వామి వివేకానంద.
• ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల
ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో
వారే ఉత్తములు.
• ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ.
ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు
ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా
మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను
ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో
తెలియడం మరీ గొప్ప కళ. మాటలే
మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా
పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి,
బలమైనవి కనుక సున్నితంగా వాడాలి,
ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.
• మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే
అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే
సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా
ఉండాలంటే మనసుతో, శరీరంతో
మాట్లాడాలి.
• మాటే సంపదలకు, మానవ సంబంధాలకు
మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి
పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది.
• నొప్పింపక తానొవ్వక తప్పించుకు
తిరుగువాడు ధన్యుడు.
• అలాంటివారికి శత్రువులే ఉండరు.
మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని
నయం చేయనూగలవు. సరైన మాటతీరు
చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా
మార్చగలదు.
• మాటల మధ్యలో సందర్భానుసారంగా
సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో
అతి మధురమైన పదాలు, మరింత
మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది.
సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి.
తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి
ఉండాలి.
• మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి.* ఏం చెప్పారనేదాని కన్నా ఎలా చెప్పారనేదాన్నిబట్టి భావ ప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
• భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.