వెంట్రుకలకు రంగు వేయడం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. కొంత ఫ్యాషన్ కోసం వేసుకుంటే.. మరికొందరు మాత్రం తెల్లవెంట్రుకలు దాచ‌డం కోసం రకరకాల రంగులు వేసుకుంటున్నారు. కారణాలేవైనా దాదాపు 75 శాతం మహిళలు రంగు వేసుకుంటున్నారు. కానీ దీని వల్ల దుష్ప్రభావాలు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. నిజానికి వెంట్రుకలకు రంగు వేసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిలోని రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి.


రంగు వేయడం వల్ల కొంతమందికి ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది అంత తేలికగా తగ్గదు. త‌ల‌పై రంగు వేసిన ద‌గ్గ‌న నుంచి మంట రావ‌డం మొదలవుతుంది. ఇలా వచ్చిన ఎలర్జీ మెడ, కళ్లు, చెవులు, నుదురుకు కూడా పాకుతుంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు. 


ముందుగా ఏ బ్రాండ్ రంగు కొనుగోలు చేస్తున్నారో దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ తర్వాత అది మీ స్కిన్ కు సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఎల్లప్పుడూ మంచి బ్రాండ్ ఎంపిక చేసుకోవడానికే ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ తలపై వెంట్రుకలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి.


టెస్ట్ చేయండి ఇలా...
ఎలర్జీ నుంచి కాపాడటం కోసం ముందుగా దాన్ని చెక్ చేయండి. దీని వల్ల అది స్కిన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ముందుగానే తెలుస్తుంది. ఇలా టెస్ట్ చేసే ముందు ప్యాకెట్ పై ఉన్న అన్ని సూచనలు సరిగ్గా చదవండి. తర్వాత అప్లై చేయండి. అప్పటి నుంచి 24 గంటల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుంటే దాన్ని మీరు నిర్భయంగా వాడుకోవచ్చు.


మీకు ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే కంగారు పడకుండా వెంటనే చల్లని నీటితో రంగును కడిగేయండి. దీనివల్ల మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. లేదా రసాయనాలు ఎక్కువగా ఉన్న రంగు అనిపిస్తే గాఢత ఎక్కువగా ఉన్న షాంపూతో కడిగేయండి. దీని వ‌ల్ల ఎలాంటి హానీ ఉండ‌దు.


మరింత సమాచారం తెలుసుకోండి: