ప్రస్తుత కాలపు మనిషి జీవనం, అలవాట్లు గతంతో పోలిస్తే పూర్తిగా మరిపియాయి. అంతా చాలావరకు డిజిటల్ మయం కావడంతో మనిషి శారీరక శ్రమ కూడా పూర్తిగా తగ్గింది. అయితే ఈ నూతన జీవన విధానాల వలన కొత్త కొత్త సమస్యలు తలెత్తుతూ అతి తక్కువ కాలంలోనే మనిషి ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తున్నాయి. ఇక వాటి వలన నేటి మనిషి రోగాల బారిన కూడా ఎక్కువగా పడుతున్నాడు. మరీ ముఖ్యంగా వయోబేధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు అందరికి సోకుతున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు ఒక వయసు మీదపడ్డ వారికి మాత్రమే వచ్చే గుండెపోటు, డయాబెటిస్, బీపీ వంటివి నేడు పెద్దగా వయోబేధం తేడాలేకుండా యుక్త వయసు వారిలో కూడా కనపడుతున్నాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, పెళ్లికాని వారికి హృద్రోగ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని,తద్వారా అది తీవ్ర గుండెపోటుకు కూడా దారితీసే అవకాశం ఉందని,     


పారిస్ లోని రాయల్ స్ట్రోక్ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో మంచి పేరుగాంచిన డాక్టర్ చున్ వాయ్ వాంగ్ నేతృత్వంలోని ఒక బృందం, మెడికల్ జర్నల్ హార్ట్ అనే నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు దశాబ్దాల పాటు యూరప్, ఉత్తర అమెరికా, మధ్య, పశ్చిమ ఆసియాలకు చెందిన వివిధ సంస్కృతుల, ప్రాంతాల, జాతుల ప్రజలపై వారు జరిపిన పరిశోధనల్లో భాగంగా పెళ్ళైన వారితో పోలిస్తే పెళ్లికాని వారిలో హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం 42 నుండి దాదాపు 55 శాతం వరకు ఉన్నట్లు తేలిందట. అదే విధంగా తమ భార్య, లేదా భర్తలతో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించేవారిలో కూడా 42 శాతానికి పైగా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువట.  


ఇక పెళ్ళైన వారిలో చాలావరకు తమ జీవనం సుఖంగా ఉందని, అలానే జీవిత భాగస్వామితో జీవితం సాగుతున్నప్పుడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉండదని చెపుతున్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న వారిలో కూడా హృద్రోగ సమస్యలు ఎక్కువని, ఎందుకంటే వారి అనుబంధం ఎక్కడ బయటపడుతుందో అని అటువంటి వారికి మరింత ఆవేదన, ఆలోచనతో అటువంటివారు కొంత ఒత్తిడికి లోనవుతారట. అందువల్ల పెళ్లికాని బ్రహ్మచారులు, ఆడవారు ఎవరైనా తమ భవిష్యత్తులో ఎటువంటి హృద్రోగ సమస్యల బారిన పడకుండా ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలనుకుంటే మాత్రం, వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. మరి, బ్రహ్మచారులు ఈ మాటలు కనుక వింటే, వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి…..!!

మరింత సమాచారం తెలుసుకోండి: