అన్నం వండినప్పుడు వచ్చే గంజిని చాలా మంది అనవసరంగా బయటపడేస్తుంటారు. ఇది ఆసియా దేశాలలో చాలా బలమైన ఆహార పదార్థము. కొన్ని ప్రాంతాలలో గంజి ప్రాథమికంగా ఉదయాన్నే ఆహారంగా భుజించి పనికి పోతుంటారు. కొంతమంది దీనిని మధ్యాహ్న భోజనానికి మారుగా తింటారు. గంజిని కుండలో కాని కొన్ని రకాల రైస్ కుక్కర్లలో తయారు చేస్తారు. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానిలో కాస్తంత ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసంగా ఉన్నప్పుడు గంజిని త్రాగితే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది.


అయితే ఒక్క గ్లాసు అన్నం గంజి తీసుకోవడం వల్ల గ్రేట్ బెన్ఫిట్స్ పొందవచ్చని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.  గంజిలో ఎమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల తాగిన వెంటనే శక్తి వస్తుంది. గ్లూకోజ్ కంటే తక్షణమే శక్తినిచ్చే గుణం ఎక్కువగా ఉంది. కండరాల నొప్పి కూడా తగ్గిస్తుంది. గంజి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. డయేరియా వచ్చిన వాళ్లు పలుచటి గంజి తాగితే మంచి ఫలితం ఉంటుంది.


అన్నం గంజిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఫెనోల్స్ ఉండటం వల్ల.. అన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తప్పించుకోవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు గంజిని తాగిస్తే చాలా మంచిది. అది తాగడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. వారికి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పాలు సరిగా తాగని పసిపిల్లలకు కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీంతో కావాల్సిన శక్తి వారికి సమకూరి శరీరానికి సరైనా శక్తి లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: