పిల్లలు అంటేనే మీ పాపకు ఏ గ్రేడ్ వస్తుంది ఏంటి అంటూ పక్కింటి వారు వచ్చి నాసా పెడుతారు. కానీ ఇక్కడ పిల్లలు ఏమో అంత బాగా చదవరు. ఎందుకంటే ప్రస్తుతం విద్య వ్యవస్థ ఆలా ఉంది. ఏదో టీచర్లు కొడుతారని పిల్లలు బయపడి హోమ్ వర్క్స్ చేసుకు వెళ్తారు కానీ శ్రద్దతో చెయ్యరు. అయితే ఇప్పుడు విద్యావిధానం పూర్తిగా మారిపోయింది కాబట్టి పెద్దలు కూడా పిల్లలకు తగ్గట్టు మారాలి. అలాంటి రోజులు వచ్చాయి ఇప్పుడు. 


 అయితే మీ పిల్లల్లో మీరు గమనించాల్సిన విషయాలు .. 


పిల్లలు తమ అభిరుచికి తగిన చదువుల్లో ముందుకు సాగేలా పెద్దలు ప్రోత్సహించాలి. అలానే తగిన వాతావరణాన్ని ఇంట్లో ఉండేలా పెద్దలు చూడాలి. 


కష్టమైన హోంవర్కులు ఉన్న సమయంలో పిల్లలకు పెద్దలు సహాయం చెయ్యాలి. ఆలా చెయ్యడం వల్ల వారికీ హోమ్ వర్క్ లో ఏ ఇబ్బంది వచ్చిన సరే మీ వద్దకు వచ్చి తెలుసుకుంటారు. 


అలాగే పిల్లల శక్తి సామర్ధ్యాలను మించి మార్కులు, ర్యాంకులు అడగడం మంచిది కాదు. అలా ఆశించడం వల్ల పిల్లలు మానసికంగా కృంగిపోతారు. 


పిల్లలకు ఎప్పుడు పాటశాలకు సంబంధించిన పుస్తకాలు కాకుండా జ్ఞానాన్ని పెంచే పుస్తకాలను అలవాటు చెయ్యండి. ఇలా చెయ్యడం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. 


అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్ళి, ఉపాధ్యాయులను కలిసి పిల్లల మీద వారి అభిప్రాయాలను తెలుసుకోవటం  మంచిది. 


చదువుతో పాటు ఆటపాటలు ఉంటే పిల్లలు మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. 


పిల్లల లేత మనసులో వచ్చే సందేహాలను వారికి అర్ధమయ్యే విధంగా వివరించి వారిని సంతృప్తిపరచాలి. అప్పుడే పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస పెరుగుతాయి. 


అలాగే పిల్లలకు అర్థంకాని సబ్జెక్టు గురించి తెలుసుకొని వారికీ అర్థం అయ్యేలా చెప్పాలి. అప్పుడే ఆ సబ్జెక్టు గురించి తెలుసుకొని మంచి మార్కులు సాధిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: