మనిషి అన్నాక అనేక భావోద్వేగాలు ఉంటాయి. కోపం, ఆనందం, దుఃఖం, విసుగు, చిరాకు.. ఇలా ఎన్నో. కానీ అన్నింటిని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఏది ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసి ఉంటే.. జీవితంలో తిరుగు ఉండదు.

 

 

కొందరు జీవితంలో చాలా కష్టపడతారు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఓ చిన్న మైనస్ పాయింట్‌ తో అనుకున్న ఫలితం మాత్రం సాధించ లేకపోతారు. ఆ మైనస్ పాయింటే అసహనం. అవును. చాలా మందికి సహనం తక్కువగా ఉంటుంది.

 

 

ఓపిక లాభయదాయకం అని చిన్నప్పటి నుంచి చదువుకున్నా అమలు విషయం వచ్చేసరికి చేతులెత్తేస్తారు. మీరే కాదు.. ఇలా అసహనంతో జీవితం కోల్పోయిన చారిత్రక పురుషులూ ఉన్నారు. ఎంతో నష్టానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామానికి సహనంలేని దుర్యోధనుడే కారకుడు.

 

 

అసహనంవల్లే అశోకుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన కళింగ యుద్ధానికి కారకుడయ్యాడు. అందుకే.. జీవితంలో కాస్త సహనం అలవర్చుకోండి. అది మీకు ఎన్నో విజయాలు అందిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: