ఈమధ్య ఒక ప్రపంచ విఖ్యాత ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో బ్లడ్ షుగర్ ప్రమాణాలు తగ్గించి తద్వారా డయాబెటీస్ రిస్క్ నుండి బార్లీ కాపాడుతుందని గుర్తించారు. లండన్ యూనివర్సిటీ వారు ఈ అధ్యనాన్ని చేసారు. బార్లీలో డయటరీ ఫైబర్స్ బాగా ఎక్కువగా ఉండటంతో ఇది ఆకలిని బాగా నియంతరించి అధిక బరువు పెరగ కుండా కార్డియో సమస్యల నుండి రక్షిస్తుందని ఈ అధ్యయనం సారాంశం.

బార్లీ తో తయారుచేసిన బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ లతో పాటు మనం రోజు తీసుకునే లంచ్ డిన్నర్ లలో బార్లీతో తయారు చేసిన వంటలు ఎక్కువగా తినగలిగితే అనేక ఆరోగ్య సమస్యల నుండి బయట వచ్చని ఈ అధ్యయనం చెపుతోంది. అంతేకాదు మధుమేహ వ్యాధి గ్రస్తులు అన్నం బదులు బార్లీని ఉడక పెట్టుకుని బీన్స్ సెనగలు కలిపి తింటే డయాబెటీస్ అన్న వ్యాధి మన శరీరం నుండి పారిపోతుంది అని సరికొత్త అధ్యయనం ఈ కొత్త విషయాలను బయట పెట్టింది. 

ఈ అధ్యయనాన్ని లండన్ లో మధ్య వయస్కులైన వారి పై చేయడానికి వారికి వరసగా 14 రోజులు బార్లీతో చేసిన రకరకాల పదార్ధాలను లంచ్ లో డిన్నర్ లో వాడటం వల్ల వారి బ్లడ్ షుగర్స్ లెవల్స్ పూర్తిగా కంట్రోల్ కు రావడం ఈ అధ్యయనం చేసిన వారికి ఆశ్చర్యాన్ని కలిగినట్లు తెలుస్తోంది.

ఎప్పటి నుంచో మన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో మెంతులను మనం తినే పదార్ధాలలో బాగా ఉపయోగించడం ద్వారా మధుమేహానికి చెక్ పెట్ట వచ్చు అన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా మెంతి కూరను మనం ఎక్కువగా క్రమం తప్పకుండ తీసుకుంటే మన శరీరంలోని రక్తం పరిశుభ్రం అవ్వడమే కాకుండా మన శరీరంలోని కొవ్వును బాగా తగ్గించి మనకు ఈ మధుమేహ వ్యాధి నుండి కూడ ఉపసమనం లభిస్తుంది అని మన ఆయుర్వేద వైద్యులు చాల సార్లు చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా బార్లీ గింజల పై జరిపిన అధ్యయనం వల్ల మనలను పీడించే ఈ మధుమేహానికి చెక్ పెట్టే అవకాశం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: