లెమన్ గ్రాస్ పేరు ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. టీ లేదా ఎసెన్సియల్ ఆయిల్ రూపంలో దీనిని ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ ఒక చిన్న పాటి సువాసన కలిగి ఉంటుంది. ఇది ఏలాంటి ఫుడ్ తో కలిపినా మంచి టెస్ట్ ని ఇస్తుంది. లెమన్ గ్రాస్ ను ముఖ్యంగా ట్రెడిషినల్ గాను మెడిసిన్స్ లో మరియ థెరఫిటిక్ కోసం ఉపయోగిస్తుంటారు. 

లెమన్ గ్రాస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లెమన్ గ్రాస్ లో విటమి్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియ, ఫాస్పరస్, క్యాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇందులో విటమిన్ ‘బి’ కూడా ఉంది. అంతేకాకుండా ఇందులో అనేక ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఆరోగ్యానికి వివిధ రకాలుగా ప్రయోజనాలను ఉండటం వల్ల, లెమన్ గ్రాస్ ను ఖచ్చితంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచిది అని డైటీషియన్స్ చెపుతున్నారు. మన రెగ్యులర్ ఫుడ్ ప్రిపరేషన్ లో లెమన్ గ్రాస్ చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. లెమన్ గ్రాస్ లో ఉండే ఆరోమా వాసన బ్రెయిన్ లో సెరోటినిన్ విడదుల చేస్తుంది. ఇది మన మూడ్ ను సక్రమంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

కొన్ని పరిశోధనల ప్రకారం లెమన్ గ్రాస్ మనస్సును ప్రశాంతతను సమకూర్చడమే కాకుండా  మన ఆందోళను తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తి పెంచడానికి  బా గా సహాయపడుతుంది. లెమన్ గ్రాస్ లో ఉండే కంటెంట్ శరీరంలోని ఫ్యాట్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించడంతో రక్తకణాల్లో కొవ్వు చేరకుండా హార్ట్ అటాక్ సమస్యల నుండి రక్షిస్తుంది.

లెమన్ గ్రాస్ ను తరచూ తింటుంటే మతిమరపు నుండి ఉపశమనం పొందటమే కాకుండా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల నాడీవ్యవస్థను స్థిరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ నొప్పులను మరియు వాపులను బాగా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న లెమన్ గ్రాస్ ను మనం తీసుకునే ఆహార పదార్ధాలతో పాటు ఉపయోగించడం వల్ల ఇలా ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చును..

మరింత సమాచారం తెలుసుకోండి: