మన దేశంలోని గ్రామాల్లో ఇప్పటికీ చాలామందికి ఆకలితీర్చే ఆహారంగా రైస్‌వాటర్‌(గంజి) త్రాగుతారు అన్న విషయం తెలిసిందే. ఈ రైస్ వాటర్ త్రాగటం వలన పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపడవల్సిందే. అయితే బియ్యం కడిగిన నీళ్లేను రైస్‌ వాటర్‌ అనుకుంటే పొరపాటే. 

ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా ఉడుకుతున్నప్పుడే ఆ నీటిని వేరు చేయాలి. అలా వేరు చేసిన నీటిని వేడిగా ఉన్నప్పుడైనా లేదా చల్లార్చిన తర్వాతైనా తాగవచ్చు. ఈబియ్యం నీళ్లు మన ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తాయి. పూర్వం కాలంలో ఈ రైస్‌ వాటర్‌ తో చైనీస్‌ ట్రీట్మెంట్‌ కూడ ఇచ్చేవారు అంటే నమ్మలేని నిజం. ఇది మన శరీరానికి అవసరమయ్యే శక్తిని అందించడంలో మంచి పాత్ర పోషిస్తుంది.  మంచినీళ్లు, బియ్యం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, అందమైన, సున్నితమైన చర్మం పొందవచ్చు అని పరిశోధనలు చెపుతున్నాయి. 

ఈ రైస్ వాటర్ లో ఉండే కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతోపాటు ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది అని అంటారు. అలాగే ఈ రైస్ వాటర్ వల్ల క్యాన్సర్‌ను నివారణ అవుతుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడంలో బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ రైస్‌వాటర్‌తో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల ముఖం పై  గుంతలు ఏర్పడకుండా నివారించవచ్చు.

రైస్‌వాటర్‌తో జుట్టుని శుభ్రం చేసుకుంటే జుత్తు పట్టుకుచ్చులా మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. రైస్‌వాటర్‌తో ఆ రైస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలోకి ప్రజలు ఈ రైస్ వాటర్ ను బాగా తీసుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: