వాలంటరీ బ్లడ్ డొనేషన్ అనే పదం విన్నప్పుడు ఆపదలో ఉన్న ఎదుట వ్యక్తికి మనం సహాయం చేస్తున్నాం అని అనుకుంటాం. అయితే ఈ రక్త దానం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుంటే ఎదుటి వారికి మనం, రక్తం అవసర సమయాలలో దానం చేయడం ఒక సేవగా కాకుండా మన జీవితానికి సంబంధించి ఒక ఆరోగ్య సూత్రంగా భావిస్తాం. 

ఇప్పటికీ మనలో చాల మందికి మనలోని బ్లడ్ ఇచ్చేయడం వల్ల బ్లడ్ తగ్గిపోతుందని భావించే వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఈ రక్త దానం చేయడం వలన మన శరీరంలోని ఐరన్ లెవెల్స్ మెయింటెన్ చేయబడతాయి. శరీరంలో ఐరన్ నిల్వలు తగ్గినప్పుడు క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. 

శరీరంలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు లివర్ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల అవకాశం చిక్కినప్పుడల్లా మన రక్తాన్ని డొనేట్ చేసి మన రక్తంలో ఉన్న ఐరన్ లెవెల్స్ తగ్గించు కోవడం మంచిదని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు. అంతేకాదు రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేసె వారికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గించుకోవచ్చు అని పరిశోధనలు చెపుతున్నాయి. 

 అదే విధంగా రెగ్యులర్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బరువు తగ్గడానికి, ఎక్స్ ట్రా క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది. తరచుగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా సాగుతుంది. శరీరమంతటికీ రక్త సరఫరా సరిగ్గా అందుతుంది. దీనివల్ల బ్లాకేజ్, బ్లడ్ వెజెల్స్ డ్యామేజ్ నివారించవచ్చు. రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి.  ఇలా ఆరోగ్యవంతమైన జీవితం పొందడానికి రక్త దానం కూడ మంచిదని అనేక పరిశోధనలు చెపుతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కనీసం ఏడాదికి రెండు సార్లు రక్త దానం ఇచ్చే అలవాటు మనం అలవరుచు కోవడం వల్ల సేవ చేసామనే సంతృప్తితో పాటు ఆరోగ్యం కూడ  చేకూరుతుoది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: