జర్మని అత్యంత అభివృద్ది చెందిన పారిశ్రామికదేశం. ఎంతొ ఐశ్వర్యంతో వర్దిల్లుతూ అన్ని విధాలా ప్రత్యేకతలు కలిగి క్రమశిక్షణకు మారుపేరైనదిగా గౌరవాన్ని కలిగి ఉన్నదేశంగా మనకు సుపరిచితం. వాళ్ళకంత గొప్ప సంస్కృతి ఎలా అబ్బింది అని అలోచించవలసిన అవసరం మనకందరకీ ఉంది. అలాగే జర్మన్స్ అందరూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఉంటారనే నమ్మకం మనకుంది.



 

ఒకసారి రతన్ టాటా తన ఫ్రెండ్స్ తో కలసి జర్మనీలోని హంబర్గ్ నగరానికి వచ్చారు. ఒక సాయంత్రం వారితో కలసి డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్ కు వెళ్ళాడు. అంత విలాసవంతమైన హోటెల్లో కూడా చాలా టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయి. ఒక టేబుల్ వద్ద ఒక యువ జంట డిన్నర్ కోసం నిరీక్షించటం చూసారు. కొద్దిసేపట్లో వెయిటెర్ వారి ఫుడ్ ఆర్డర్ సర్వ్ చేస్తూ ఒకటి రెండు ఫుడ్  డిషెస్  మాత్రమే వారిముందు పెట్టాడు. సర్వ్ చేసిన ఫుడ్ చూసిన తరవాత ఆ జంటలోని ఆ అబ్బాయి పిసినారి అనిపించింది.  ఇంత తక్కువ ఐటెంస్,  ఒక రెండు గ్లాసుల బీర్ మాత్రం వారికి రొమాంటిక్ గా ఉండొచ్చేమొగాని కడుపు నిండదని అనిపించింది. బహుశా వారి కాపురం మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుందనిపించక మానదు. ఇంత పిసినారితో ఆ అమ్మాయి ఎంతకాలం వేగుతుంది. వదిలేసి పోవటం ఖాయం అనిపించింది వారందరికి. 



 

కొద్ది దూరములో మరో టేబుల్ వద్ద నలుగురైదుగురు మహిళలు డిన్నర్ చేస్తున్నారు. వెయిటర్ వారికి డిన్నర్ సెర్వ్ చేయటం,  వారు పూర్తిగా ప్రతి ఆహార పదార్ధాన్ని కొంచెం కూడా ప్లేట్లలో కాని, డిషెస్ లో కాని వదిలేయకుండా,  శుభ్రంగా తినేయటం గమనించారు.





వారు మంచి ఆకలితో ఉండటంతో  లోకల్ కొలీగ్స్ అనేక రకాల  ఫుడ్  ఐటెంస్ ఆర్డర్ చేశారు.  ఆ రుచికరమైన ఫుడ్ తినటం ప్రారంబించి,  త్వరగా తినటం ముగించి వెళ్ళటానికి సిద్దమయ్యరు.  ప్లేట్లలో దాదాపు మూడో వంతు ఫుడ్ మిగిలిపోయింది. వారు వెళ్ళటానికి రడీ అయినప్పుడు అక్కడ ఉన్న మహిళలు,  మేము వదిలేసిన ఫుడ్ చూపుతూ, వృధాచేసిన ఫుడ్ గమనించ మని చెపుతూ వారి అసంతృప్తిని ఇంగ్లిష్ లో వ్యక్తం చేశారు. దానికి  లోకల్ కొలీగ్స్ “ మేము పే చేసి ఆర్డర్ చెసి  తెప్పించుకుని తిన్న,  వదిలేసిన ఆహారం గురించి ప్రశ్నించే హక్కు మీకులేదని,  అది మీకు అనవసరమని తిన్న వదిలేసిన ఫుడ్ పై కామెంట్ చేసే అధికారం లేదని వాదించారు”



దానికి కోపించిన ఒక మహిళ తన హాండ్ ఫొన్ నుండి ఎవరితోనో మాట్లాడటం, ఇంతలోనే ఒకతను యూనిఫాంలో వచ్చారు. ఆయన సోషల్ సెక్యూరిటి ఆర్గనైజేషన్ కు చెందినట్లు మాకు అర్థమైంది. అతను జరిగినది కూల్ గా పరిశీలించి జరిగిన దానికి మాకు  ఫిఫ్టి యూరోల పెనాల్టి వేసిన, "మీరు ఆర్డర్ చేసి తినే అధికారం మీకుంది. దానికి మీరు బిల్ల్ పే చేశారు. తిని ఉంటే అందరికి మంచిది. అలాకాకుండా వదిలివేసిన ఫుడ్ తో మీరు మా సామాజిక వనరులను అవమానించారు. ప్రపంచమంతా ఆహార లభ్యత తక్కువగా ఉంది. డబ్బు పెట్టినా సరైనంత ఆహార వనరులు ప్రపంచములో లభ్యం కావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ వృధాచేయటం మాహానేరం"  అని కొద్దిగా కఠినంగానే చెప్పారు.  దానికి  సమాదానంలేక కొంత, ఆ ధనవంతమైన దేశ ప్రజల ఆలోచనావిధానానికి మరికొంత,  దిక్కుమాలిన మన మైండ్ సెట్ కి సిగ్గుపడి ఇంకొంత మౌనం వహించారు.




“అంతగా సంపదలేని దేశం నుండి వచ్చిన మాకు, పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు లాంటి విలాసాల పేరుతో విచ్చలవిడిగా ఆహారాన్ని, కనిపించవచ్చు. కాని ఆ అలోచన, అందులోని వాస్తవాన్ని గుర్తించి అలా ప్రవర్తించటం మనం మొదలు పెడితే కొన్ని సంవత్సరాలలో మనదేశం అభివృద్దిలో జర్మనీని మించిపోగలదని రతన్ టాటా ఒక సంధర్భముచెప్పి, తాను మారానని మీరూ మారండని భారత ప్రజానీకాన్ని కోరారు. ఇతర వనరులను వృదా చేయటం, సాంప్రదాయంగా ఉంటున్న మనకు ఈ క్రమ శిక్షణ కొంత విచిత్రంగా అందులోమనకు కనీసం అలోచన లోనికి రాని విషయాలు  షాక్ ఇచ్చాయి. లేని హంగుకుకు పోతూ అథిదిమర్యాదల పేరుతొ మనం చేసే వృదా ఆహార పదార్ధాలోనే కాదు అన్నింటిలోను మనకు అనర్ధమే.  ఫుడ్ కు మనం పే చేశాం. కాని వనరులు సృష్టించినవారికి, సెర్వ్ చెసినవారికి, వేదిక ఇచ్చిన వారికి, సదుపాయా లు కల్పించినవారికి, జీవితం కొనసాగటానికి సహకరిస్తున్న వారికి రక్షణ కల్పిస్తున్న సార్వభౌమత్వానికి మనం ఏమీ పే చేయటంగాని  ఋణం గాని చెల్లించట్లేదు. ఆ వనరుల విలువలను గుర్తించితే మనం జర్మనీని మించి ఎదగగలం.




నేను మారాను. మీరూ మారండి. ఈ కథచెప్పి ఇతరులను మార్చండి అన్నారు. దీనిని ఎంత ఎక్కువమందికి షేర్ చేస్తే అంత ప్రయోజనం ఉండవచ్చు. 

“వనరులను అనుభవించే హక్కు తప్ప, వృధాచేసే హక్కు వినియోగదారుడికి లేదు”  --- రతన్ టాటా

(మానవతా విలువల ప్రచారానికి ఇంటర్నెట్ లో ఈ  రతన్ టాటా అనుభవం అనేకసార్లు చెప్పబడింది. మీరూ గతం లో చూసి ఉండవచ్చు. ఈ విషయం ఇప్పుడు మాత్రం  “ఏపి హెరాల్డ్ పాఠకుల”  కోసం)



మరింత సమాచారం తెలుసుకోండి: