ప్రపంచంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న పొల్యూషన్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఎవరూ జాగ్రత్తలు మాత్రం తీసుకోరు. భూమిపై ప్రతి ఒక్కటీ కాలుష్యం అవుతున్నాయి. అయితే పొల్యూషన్ నిర్మూలించడానికి ఒక్కటే మార్గం చెట్ల పెంపకం..వాటి ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలితో చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని శాస్త్రజ్ఞులు తెల్పుతున్నారు. ఇక నీటి విషయానికి వస్తే..ఈ మద్య నీటిని పరిశుభ్రపరిచే ఎన్నో యంత్రాలు వస్తున్నాయి. తాజాగా గాలిలోని తేమతో స్వచ్ఛమైన నీటిని తయారు చేసే విధానం మన భారతీయుడు కనిపెట్టడం విశేషం. వివరాల్లోకి వెళితే..గాలిలో తేమను స్వచ్చమైన తాగు నీటిగా మలిచే అద్భుతమైన యంత్రాన్ని మన 22ఏళ్ల హైదరాబాదీ విద్యార్థి కనిపెట్టాడు.

నగరంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదువుతున్న జవ్వాద్ పటేల్ చేతిలో ఈ యంత్రం రూపుదిద్దుకుంది.  అటోమెటిక్ గా నడిచే ఈ త్రీడి ప్రింటెడ్ ఇన్ట్యూటివ్ సెల్ఫ్ ఫిల్లింగ్ వాటర్ మెషిన్ పనిచేస్తుందని జవ్వాద్ చెప్పాడు. ఈ తరహా మెషిన్ ఆసియా ఖండంలో తానే మొదటిసారిగా కనిపెట్టినట్లు తెలిపాడు.

అంతే కాదు ఇలా వచ్చే నీరు ఎంతో స్వచ్చంగా ఉంటాయని అంటున్నారు. చిన్ననాటి నుండే పరిశోధనలపై ఆసక్తి పెంచుకుని పలు యంత్రాలను కనిపెట్టాడు. వాటిల్లో కొన్నింటికి పేటెంట్ కూడా సంపాదించాడు. పలు పరిశోధనాత్మక పోటీల్లో పాల్గొని విజయం సాధించి మెడల్స్ కొట్టాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: