ఈరోజులలో ఫ్యాట్ సమస్య లేకుండా ఎవరు ఉండరు.  పొట్ట చుట్టూ ఏర్పడే ఫ్యాట్ వల్ల అది మనకు అసౌకర్యంగా మారడమే కాకుండా మన బాడీ లుక్ ను విపరీతంగా పాడుచేస్తుంది.  దీనితో నేటి యువతరం అంతా తమకు పొట్ట సమస్య ఏర్పడుకుండా ప్రతిరోజు జిమ్ముల చుట్టూ తిరుగుతూ తమ పొట్టను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.  

మనం అందంగా కనిపించాలంటే ఫ్యాట్ లేకుండా  ఫ్లాట్ టమ్మీ కలిగి ఉండాలి.  చాలా కొద్దిగా తిన్నా కొంచెమే తాగినా కూడా పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుంటుంది. మన బాడీలో ఏర్పడే  రకరకాల  పొట్టలలో  బెల్లీ ఫ్యాట్ కరిగించడం చాలా కష్టం. అయితే ఎటువంటి శ్రమ పడకుండా పెద్దగా జిమ్ముల చుట్టూ తిరగకుండా కొన్ని డ్రింక్స్ వేగంగా మన  బరువు తగ్గించడానికి సహాయపడతాయి అన్న పరిశోధనలు ఉన్నాయి.

వ్యాయామం కంటే రెండు రెట్లు  వేగంగా మన బరువును  తగ్గించడంలో ఈ డ్రింక్స్ సహాయ పడతాయి అని అంటున్నారు.  వీటిల్లో ముఖ్యమైన కొన్ని రకాల డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

వీటిల్లో ప్రధమ స్థానంలో వచ్చే నల్ల మిరియాల టి గురించి తెలుసుకుందాం.  నల్లమిరియాలు, అల్లంను నీటిలో 5 నిమిషాలు ఉడికించాలి. వడకట్టిన తర్వాత  తేనె కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ టీ తాగడం వల్ల బెల్లీ సమస్య పరిష్కారం అవుతుంది అని అంటున్నారు. అలాగే లెమన్ టీని గురించి కూడ మనం తెలుసుకుందాం. మన శరీర బరుఉను తగ్గించడంలో లెమన్ టీ ఎంతగానో సహకరిస్తుంది.  

ఈ టీలు అన్నింటిలోకి  బ్లాక్ టీ గురించి ప్రముఖంగా పేర్కొనాలి. టీ ఆకులను మరిగించిన వేడి నీటిలో వేసి ఆ తరువాత వొడగొట్టి తీసుకోవాలని డైటీషియన్స్ చెపుతున్నారు. ఈ బ్లాక్ టీ వల్ల మన శరీరంలోని బెల్లీ సమస్య 90% వరకు నివారించ వచ్చని వైద్యులు చెపుతున్నారు.
 
వీటితో పాటు అల్లం తులసీ టీల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మరుగుతున్న నీటిలో అల్లం ముక్కలు కలపాలి అలాగే కొన్ని తులసి ఆకులు కలపాలి దీనివల్ల ఈ టీ రుచిగా ఉండటమే కాకుండా మన శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఔషదంగా పని చేస్తుంది. ఇలా అనేక రకరకాల టీ లు తీసుకోవడం వల్ల సహజంగానే జిమ్ములకు వెళ్ళకుండా మన బెల్లీ ని తగ్గించుకోవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: