రాగి గింజలలో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉన్న విషయం తెలిసిందే.  మ‌న శరీరానికి ఎంతో మేలు చేసే ఈ రాగి గింజలను జావగా చేసుకుని త్రాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  ముఖ్యంగా బరువు సమస్యతో బాధ పడే వారికి ఈ రాగి అంబలి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.

రాగుల‌ను కొంత ప‌రిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టి ఆ తరువాత పరి శుభ్ర‌మైన వ‌స్త్రంలో క‌ట్టి మ‌ళ్లీ కొన్ని గంట‌ల పాటు ఉంచితే అవి మొల‌కెత్తుతాయి. కొన్ని సార్లు రాగులు మొల‌కెత్త‌డం ఆల‌స్యం కూడా అవ‌చ్చు. 

ఆతరువాత మొలకెత్తిన రాగులను ఎండబెట్టి దంచి పొడిగా చేసిన తరువాత  ఆ పొడిని నీటిలో వేసి ఉడికిస్తే రాగి జావగా మారుతుంది.  రుచి కోసం మనం దీనిలో జీడిపప్పు, ప‌ల్లీలు, కిస్మిస్‌, తేనె వంటివి క‌లుపుకోవ‌చ్చు. లేదంటే ఉప్పు, కారం కూడా క‌ల‌ప‌వ‌చ్చు. అలా క‌లుపగా వ‌చ్చేదే రాగి అంబ‌లి. 

ఈ రాగి అంబలి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అన్నది పరిశీలిద్దాం.  రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి అని వైద్యులు కూడ చెపుతారు.  

ముఖ్యంగా ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల శక్తివంతంగా తయారవుతారు.  రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీనితో మన శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.  ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు అని అంటారు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతగానో మేలు చేస్తుంది. 

ప్ర‌తి రోజూ మనం  ఉద‌యం తినే అల్పాహారానికి బదులుగా ఈ రాగి అంబలి తీసుకుంటే మ‌నం రోజంతా యాక్టివ్‌గా ఉండ‌టమే కాకుండా మన శరీర దృఢ‌త్వంలో కూడ చాల మార్పు వస్తుంది. ముఖ్యంగా బీపీ, షుగ‌ర్ ఉన్నవారికి ఆ వ్యాధులను నియంత్ర‌ణ‌లోకి తీసుకురావడానికి ఈ రాగి అంబలి ఎంతగానో ఉపకరిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ రాగి అంబలిని ఇంటి వైధ్యంలా తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: