మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయని అనేక పరిశోధనలు తెలియచేసాయి. శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు అని ఆయుర్వేద వైద్యులు కూడ చెపుతున్నారు.

చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్‌ ఆయిల్ ది ప్రత్యేక స్థానం. చర్మానికి వాడే మందులు, ఆయింట్‌ మెంట్స్‌ తయారీలోనూ దీనిని ఎక్కువగా వాడుతారు. ఈ నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. 

చలికాలంలో డ్రై చర్మం కలవారు ఆలివ్‌ ఆయిల్‌ను చర్మానికి ప్రతిరోజూ రాస్తుంటే చర్మం పగలకుండా ఉంటుంది. ఆకుకూరలు ఉడికించే నీళ్లలో కొద్దిగా ఆలివ్‌నూనె వేస్తే పోషక విలువలు పోకుండా తగ్గకుండా ఉంటాయి అని అంటారు. జుట్టు పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, ఆలివ్‌నూనె, ఆముదాలను సమపాళ్ళలో తీసుకుని బాగా కలపాలి. తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించి తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

ఆలివ్ నూనె వృద్ధుల్లో స్ట్రోక్ రిస్క్‌ను సగానికి సగం తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించడం, అలాగే స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ ఉపయోగించిన వృద్ధుల్లో 41 శాతం స్ట్రోక్ తగ్గిందని పరిశోధనలో తేలింది. ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

చలికాలంలో ఆలివ్‌ఆయిల్‌ను పెదాలకు రాస్తూంటే పెదాలు పగలకుండా మృదువుగా వుంటాయి. ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలివ్‌ఆయిల్‌లో పసుపుపొడిని కలిపి పాదాల పగుళ్ళకు, వేళ్ళమధ్య పాసిన చర్మానికి రాస్తూంటే ఆ బాధ తగ్గిపోయి, చర్మం చక్కగా ఉంటుంది. మలబద్ధకంతో బాధపడుతున్న పిల్లలకు ఆలివ్‌ఆయిల్‌తో చేసిన ఆహార పదార్థాలను తినిపిస్తే నయం అవుతుంది. లేదంటే ఆలివ్‌ఆయిల్‌ను వెచ్చచేసి పిల్లల బొడ్డు చుట్టూ మర్దనా చేసినట్ట‌యితే మలబద్ధకం తగ్గుతుంది అని అంటారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఆలివ్ ఆయిల్ ద్వారా పొందవచ్చు..



మరింత సమాచారం తెలుసుకోండి: